‘న‌మ‌శ్శివాయ’ పంచాక్ష‌రీ స్తోత్రం నిత్యం ప‌ఠిస్తే!

విధాత‌: న‌మశ్శివాయ అని స్మ‌రిస్తే చాలు నేనున్నాను అంటూ వ‌రాల వ‌ర్షం కురిపిస్తాడు ఆ బోళాశంకురుడు. ఆయ‌న స‌న్నిధిలో పంచాక్ష‌రి మంత్రం ప‌ఠిస్తే పొంగిపోతాడు. అంత‌టి మ‌హిమాన్విత‌మైన‌ది పంచాక్ష‌రీ మంత్రం. ఆ మంత్రంలోని ప్ర‌తీ అక్ష‌రం మ‌హాదేవుడి రూపాన్ని, ఆహార్యాన్ని దృశ్య రూపం గావించి శివ భ‌క్తుల‌ను మంత్ర‌ముగ్దుల్ని చేస్తుంది. నాగేంద్ర‌హారాయ త్రిలోచ‌నాయ భ‌స్మాంగ రాగాయ మ‌హేశ్వ‌రాయ‌ నిత్యాయ శుద్దాయ దిగంబ‌రాయ‌ త‌స్మై 'న' కారాయ న‌మ‌శ్శివాయ‌ మందాకిని స‌లిల చంద‌న చ‌ర్చితాయ‌ నందీశ్వ‌ర ప్ర‌మ‌ధ‌ నాథా […]

‘న‌మ‌శ్శివాయ’ పంచాక్ష‌రీ స్తోత్రం నిత్యం ప‌ఠిస్తే!

విధాత‌: న‌మశ్శివాయ అని స్మ‌రిస్తే చాలు నేనున్నాను అంటూ వ‌రాల వ‌ర్షం కురిపిస్తాడు ఆ బోళాశంకురుడు. ఆయ‌న స‌న్నిధిలో పంచాక్ష‌రి మంత్రం ప‌ఠిస్తే పొంగిపోతాడు. అంత‌టి మ‌హిమాన్విత‌మైన‌ది పంచాక్ష‌రీ మంత్రం. ఆ మంత్రంలోని ప్ర‌తీ అక్ష‌రం మ‌హాదేవుడి రూపాన్ని, ఆహార్యాన్ని దృశ్య రూపం గావించి శివ భ‌క్తుల‌ను మంత్ర‌ముగ్దుల్ని చేస్తుంది.

నాగేంద్ర‌హారాయ త్రిలోచ‌నాయ
భ‌స్మాంగ రాగాయ మ‌హేశ్వ‌రాయ‌
నిత్యాయ శుద్దాయ దిగంబ‌రాయ‌
త‌స్మై ‘న’ కారాయ న‌మ‌శ్శివాయ‌

మందాకిని స‌లిల చంద‌న చ‌ర్చితాయ‌
నందీశ్వ‌ర ప్ర‌మ‌ధ‌ నాథా మ‌హేశ్వ‌రాయ‌
మందార ముఖ్య బ‌హుపుష్ప సుపూజితాయ‌
త‌స్మై ‘మ’ కారాయ న‌మ‌శ్శివాయ‌

శివాయ గౌరీ వ‌ద‌నార‌వింద
సూర్యాయ ద‌క్షాధ్వ‌ర నాశ‌కాయ‌
శ్రీ నీల‌కంఠాయ వృష‌ద్వ‌జాయ‌
త‌స్మై ‘శి’ కారాయ న‌మ‌శ్శివాయ‌

వ‌శిష్ట కుంభోద్భ‌వ గౌత‌మాది
మునీంద్ర దేవార్చిత శేఖ‌రాయ‌
చంద్రార్క వైశ్వాన‌ర లో చ‌నాయ‌
త‌స్మై ‘వ’ కారాయ న‌మ‌శ్శివాయ‌

య‌క్ష‌స్వ‌రూపాయ జ‌టాధ‌రాయ‌
పినాక హ‌స్తాయ స‌నాత‌నాయ‌
దివ్యాయ దేవాయ దిగంబ‌రాయ‌
త‌స్మై ‘య‌’ కారాయ న‌మ‌శ్శివాయ‌

పంచాక్ష‌ర‌మిదం పుణ్యం యః ప‌ఠేచ్ఛివ స‌న్నిధౌ
శివ‌లోక‌మ‌వాప్నోతి శివేన స‌హ మోద‌తే

  • నాగేంద్రుని హార‌ముగా ధ‌రించిన వాడు, మూడు క‌న్నుల‌వాడు, భ‌స్మ‌ము ఒంటి నిండా పూసుకున్నవాడు, మ‌హేశ్వ‌రుడు, నిత్య‌మైన‌వాడు, ప‌రిశుద్ధుడు, దిగంబ‌రుడు. న‌మ‌శ్శివాయ అను మంత్ర‌ములోని ‘న’ అను అక్ష‌ర‌మైన‌వాడు అగు శివున‌కు న‌మ‌స్కార‌ము.
  • ఆకాశ‌గంగా జ‌ల‌మ‌నే చంద‌న‌ము పూయ‌బ‌డిన‌వాడు, నందీశ్వ‌రుడు మొద‌లైన ప్ర‌మ‌ధ గ‌ణ‌ముల‌కు నాయ‌కుడు, మందార‌ము మొద‌లైన అనేక పుష్ప‌ముల‌తో పూజింప‌బ‌డిన‌వాడు. న‌మ‌శ్శివాయ అను మంత్ర‌ములోని ‘మ‌’ అను అక్ష‌ర‌మైన‌వాడు అగు శివున‌కు న‌మ‌స్కార‌ము.
  • మంగ‌ళ‌క‌రుడు, పార్వ‌తీ ముఖ‌మ‌నే ప‌ద్మ‌స‌ముదాయ‌మును విక‌సింప‌చేయు సూర్యుడు, ద‌క్షుని యాగ‌ము నాశ‌నం చేసిన‌వాడు, న‌ల్ల‌ని కంఠ‌ము క‌ల‌వాడు, జండాపై ఎద్దు చిహ్న‌మున్న వాడు. న‌మ‌శ్శివాయ అను మంత్ర‌ములోని ‘శి’ అను అక్ష‌ర‌మైన‌వాడు అగు శివున‌కు న‌మ‌స్కార‌ము.
  • వ‌శిష్ఠుడు, అగ‌స్త్యుడు, గౌత‌ముడు మొద‌లైన మునీంద్రుల చేత పూజింప‌బ‌డు జ‌టాజూట‌ము క‌ల‌వాడు, చంద్రుడు, సూర్యుడు, అగ్ని మూడు క‌న్నులుగా క‌ల‌వాడు. న‌మ‌శ్శివాయ అను మంత్ర‌ములోని ‘వ‌’ అను అక్ష‌ర‌మైన‌వాడు అగు శివున‌కు న‌మ‌స్కార‌ము.
  • య‌క్ష‌స్వ‌రూపుడు, జ‌ట‌ల‌ను ధ‌రించిన వాడు, పినాక‌ము అను ధ‌నుస్సును చేతిలో ప‌ట్టుకున్న‌వాడు, స‌నాత‌నుడు, ఆకాశ‌మునందుండు దేవుడు, దిగంబ‌రుడు. న‌మ‌శ్శివాయ అను మంత్ర‌ములోని ‘య‌‘ అను అక్ష‌ర‌మైన‌వాడు అగు శివున‌కు న‌మ‌స్కార‌ము.పావ‌న‌మైన ఈ పంచాక్ష‌రి స్తోత్రాన్ని ఎవ‌రు శివ‌సాన్నిధ్యంలో స్తుతిస్తారో వారికి శివ‌లోక ప్రాప్తి క‌లిగి, శివుని అనుగ్ర‌హ‌ము ప్రాప్తించును.