Bellampally MLA | తీరు మారకుంటే శిక్ష తప్పదు.. బెల్లంపల్లి ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్‌! కలకలం రేపుతున్న బెదిరింపు లేఖ

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. ఇటీవల అమ్మాయిలను పంపాలని ఆరిజన్ డైరీ నిర్వాహకులను వేధించిన నేపథ్యంలో సింగరేణి కోల్‌బల్ట్‌ కమిటీ కార్యదర్శి ప్రభాత్‌ రాసిన లేఖ కలకలం రేపుతున్నది. సమస్యల పరిష్కారం కోసం ఆయన వద్దకు వచ్చే మహిళలను చిన్నయ్య లొంగదీసుకుంటున్నాడని ప్రభాత్‌ ఆరోపించారు. టీఆర్ఎస్ మహిళా శ్రేణులను సైతం ప్రలోభాలకు గురిచేసి, కాటు వేస్తున్నారని పేర్కొన్నారు . గతంలో దుర్గం […]

  • By: krs    latest    Apr 02, 2023 8:09 AM IST
Bellampally MLA | తీరు మారకుంటే శిక్ష తప్పదు.. బెల్లంపల్లి ఎమ్మెల్యేకు మావోయిస్టుల వార్నింగ్‌! కలకలం రేపుతున్న బెదిరింపు లేఖ

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు మావోయిస్టులు బెదిరింపు లేఖ రాశారు. ఇటీవల అమ్మాయిలను పంపాలని ఆరిజన్ డైరీ నిర్వాహకులను వేధించిన నేపథ్యంలో సింగరేణి కోల్‌బల్ట్‌ కమిటీ కార్యదర్శి ప్రభాత్‌ రాసిన లేఖ కలకలం రేపుతున్నది.

సమస్యల పరిష్కారం కోసం ఆయన వద్దకు వచ్చే మహిళలను చిన్నయ్య లొంగదీసుకుంటున్నాడని ప్రభాత్‌ ఆరోపించారు. టీఆర్ఎస్ మహిళా శ్రేణులను సైతం ప్రలోభాలకు గురిచేసి, కాటు వేస్తున్నారని పేర్కొన్నారు .

గతంలో దుర్గం చిన్నయ్య గురువు బోడ జనార్ధన్ హయాంలో గ్రామ సర్పంచిగా, ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవుల్లో ఉండి అనేక అనేక అవినీతి అక్రమాలకు పాల్పడటమే కాకుండా.. మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని, దీనిపై మావోయిస్టు పార్టీ హెచ్చరికల నేపథ్యంలో అక్కడినుండి మంచిర్యాలకు మకాం మార్చాడని పేర్కొన్నారు.

టీఆర్ఎస్లో చేరి ఎమ్మెల్యేగా గెలుపొంది, గురువును మించిన శిష్యునిగా, అపర కీచకునిగా వ్యవహరిస్తు న్నారని పేర్కొన్నారు. దుర్గం చిన్నయ్య ప్రభుత్వ భూములను కబ్జా చేసి డైరీ నిర్వహణకు అప్పగించారని, అనంతరం రైతులను మోసం చేసి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని పేర్కొన్నారు.

ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో సమస్య బయట వచ్చిందని తెలిపారు . దుర్గం చిన్నయ్య వెంటనే రైతులకు రావాల్సిన డబ్బులను దగ్గరుండి ఇప్పించాలని డిమాండ్ చేశారు. దుర్గం చిన్నయ్య, అతని అనుచరులు తీరు మార్చుకోవాలని లేనిపక్షంలో ప్రజల చేతిలో శిక్ష తప్పదని హెచ్చరించారు .