ఇలియానా చెప్పిన ఆసక్తికర సంగతులు..తల్లిగా వేదనకి గురయ్యానంటూ కామెంట్

ఇలియానా చెప్పిన ఆసక్తికర సంగతులు..తల్లిగా వేదనకి గురయ్యానంటూ కామెంట్
అందాల ముద్దుగుమ్మ ఇలియానా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. గోవా బ్యూటీగా పాపులారిటీ అందుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ చిత్రాలలో అదరగొట్టింది.పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన పోకిరి సినిమాతో బ్లాక్ బాస్టర్ అందుకున్న ఈ అందాల ముద్దుగుమ్మ ఈ సినిమా ద్వారా ఇండస్ట్రీలో మళ్లీ వెనక్కి తిరిగి చూసుకోలేదు. అయితే కెరియర్ పరంగా వరుస సినిమాలలో నటిస్తూ ఒకానొక సమయంలో సౌత్ ఇండస్ట్రీని ఓ రేంజ్ లో ఊపేస్తున్న ఇలియానా సడెన్‌గా బాలీవుడ్ కి షిప్ట్ అయింది. అక్కడ అవకాశాలు అందుకున్నా కూడా మంచి హిట్స్ దక్కించుకోలేకపోయింది. ఇలియానాఈ నటించిన సినిమాలన్నీ కూడా ఒక్కొక్కటి ఫ్లాప్ కావడంతో కెరియర్ పరంగా అవకాశాలు సన్నగిల్లాయి.
ఇలియానా కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా కూడా సోషల్ మీడియాలో మాత్రం నానా రచ్చ చేస్తుంది. ఇటీవల తాను ప్రెగ్నెంట్ అనే విషయాన్ని ప్రకటించడంతో అందరూ షాక్ అయ్యారు.ఇలా ఈమె ప్రెగ్నెన్సీ న్యూస్ చెప్పడంతో ఇలియానా పెళ్లి కాకుండా తల్లి కావడం ఏంటని అందరు ఆశ్చర్యపోయారు. అయితే ఇలియానా రహస్య వివాహం గురించి ఏ మాత్రం స్పందించకుండా ఉండే సరికి అసలు ఈమెకి పెళ్లి జరిగిందా లేదా అని అందరు అనుకున్నారు. అయితే ఇలియానా ఆగస్టు ఒకటవ తేదీ పండంటి మగ బిడ్డకు జన్మినవ్వగా, తనకు కొడుకు పుట్టాడు అంటూ ఈ విషయాన్ని ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో అందరు అవాక్కయ్యారు.
కొద్ది రోజులకి తన భర్త పేరు మైఖేల్ డోలాన్ అని తెలియజేసిన ఈ ముద్దుగుమ్మ కొడుక్కి కోవా ఫోనిక్స్ డోలాన్ అని పేరు పెట్టింది, అయితే ఇలియానా తల్లిగా మానసిక వేదనకి గురైనట్టు తెలియజేయగా, ఈ మధ్య తన కొడుకు చిన్నపాటి అనారోగ్యానికి గురయ్యాడని తాను తల్లిగా తల్లడిల్లిపోయినట్లు తెలిపింది. కన్నబిడ్డ అనారోగ్యానికి గురైతే తల్లి మనసు ఎంతగా వేదన చెందుతుంతో తెలియజేసింది ఇలియానా. తల్లి అయ్యాకే ఈ విషయాలు ప్రతి ఒక్కరికి తెలిసి వస్తాయని కూడా ఈ ముద్దుగుమ్మ తెలిజయేసింది. ప్రస్తుతం సినిమాలకి దూరంగా ఉన్న ఇలియానా ఇప్పుడు సోషల్ మీడియాలో నానా రచ్చ చేస్తుంది.