Ileana| పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. అందులోని డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అన్నీ తెగ పాపులర్ అయ్యాయి. ఆ సినిమానే మహేష్, ఇలియానా ఇద్దరిని ఓరేంజ్‌లో నిలబెట్టింది. ఇలియానా టాలీవుడ్లో జెండా పాతేయడానికి కారణమైంది. మొదటి సినిమా ‘దేవదాస్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంటరైన గోవా బ్యూటీ ఇలియానా పోకిరితో పదేళ్ళ పాటు ఇండస్ట్రీలో నిలబడే క్రేజ్ సంపాదించింది. పొడుగు కాళ్ళతో, బక్కపలచని శరీరంతో ఎందరో మతులు పోగొట్టిన అమ్మడికి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. […]
Ileana|
పోకిరి సినిమా బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. అందులోని డైలాగ్స్, యాక్షన్ సీన్స్ అన్నీ తెగ పాపులర్ అయ్యాయి. ఆ సినిమానే మహేష్, ఇలియానా ఇద్దరిని ఓరేంజ్‌లో నిలబెట్టింది. ఇలియానా టాలీవుడ్లో జెండా పాతేయడానికి కారణమైంది. మొదటి సినిమా ‘దేవదాస్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంటరైన గోవా బ్యూటీ ఇలియానా పోకిరితో పదేళ్ళ పాటు ఇండస్ట్రీలో నిలబడే క్రేజ్ సంపాదించింది. పొడుగు కాళ్ళతో, బక్కపలచని శరీరంతో ఎందరో మతులు పోగొట్టిన అమ్మడికి వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.
తెలుగులో జల్సా, కిక్, రాఖీ వంటి సినిమాలు చేస్తూనే బాలీవుడ్‌కి కూడా పయనం కట్టింది. అక్కడా అవకాశాలు బాగానే వచ్చాయి. పెళ్ళీడు దాటిపోతున్నా ఎవరినీ లైఫ్‌లోకి రానీయడం లేదని, లేడీ బ్యాచులర్‌గా ఉండిపోతుందేమోనంటూ కొన్నాళ్ళు ట్రోల్ అయిన ఇలియానా.. ఆపైన ఫోటోగ్రాఫర్ ఆండ్రూతో ప్రేమలో ఉందని, లివింగ్ రిలేషన్లో ఉందనే వార్తలు వచ్చినా పెద్దగా స్పందించలేదు.
కొన్నాళ్ళకి ఇద్దరూ విడిపోయారని, పాపం ఇలియానా ఈ విషయంగా డిప్రెషన్లోకి వెళ్ళిందనే మాటలూ వినిపించాయి. అయితే ఇలియానా మాత్రం వీటిలో వేటికీ క్లారిటీ ఇచ్చింది లేదు. కానీ ఇన్‌డైరెక్ట్‌గా సూసైడ్ వరకు వెళ్లినట్లుగా కొన్ని సంకేతాలను అప్పట్లో ఇచ్చింది
ఇప్పుడు సడెన్‌గా బేబీ బంప్‌తో ఉన్న ఫోటోలు ఇన్‌స్టాలో పెట్టి అందరికీ షాక్ ఇచ్చింది. అంతవరకూ ఎవరితోనో ఇలియానా డేటింగ్లో ఉందనే గాసిప్స్ వచ్చినా ఆ వ్యక్తి ఎవరో క్లారిటీ లేక ఆ వార్తలు అక్కడే ఆగిపోయాయి. పెళ్ళి కాకుండానే.. ఈ ప్రెగ్నెన్సీ వ్యవహారం ఏంటో తెలుసుకోవాలని, ఆ వ్యక్తి గురించి తెగ ఆసక్తిగా ఎదురుచూశారు ఇలియానా ఫ్యాన్స్.
కాకపోతే ఇలియానా కూడా అతని గురించి కాస్త రహస్యంగానే ఉంచింది. అతడు కుక్కతో ఆడుకుంటున్న ఫోటో ఇన్‌స్టాలో పెట్టినా ముఖం కనిపించకుండా కవర్ చేస్తూ జాగ్రత్తపడింది. ఆ ఫోటోపై ఓ రేంజ్లో వార్తలు వచ్చాయి. తాజాగా తొమ్మిది నెలల గర్భంతో ఉన్న ఇలియానా ఇప్పుడు ‘డేట్ నైట్’ అంటూ పోస్ట్ చేసిన ఫోటోస్‌లో ఉంది మాత్రం ఇలియానా బాయ్ ఫ్రెండే అంటూ మళ్ళీ రచ్చ సాగుతుంది. ఇన్‌స్టాలో ఇలియానా పెట్టిన ఆ ఫోటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. అతని గురించి వివరాలు మాత్రం ఎక్కడా చెప్పలేదు.
ఆ మధ్య వరకూ కత్రినా కైఫ్ సోదరుడితో ఇలియానా డేటింగ్లో ఉందనే ప్రచారం జోరుగా సాగింది. ఇప్పుడు ఇలియానా పోస్ట్ చేసిన ఫోటోలు అతనివి కాకపోవడంతో అదంతా రూమర్ అని తేలిపోయింది. త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్న ఈ అమ్మడు తన బాయ్ ఫ్రెండ్ వివరాలు బయట పెడుతుందనే కాచుకున్నారు ఫ్యాన్స్. ప్రెగ్నెన్సీకి ముందు వెబ్ సిరీస్‌ల్లో నటించిన ఇలియానా, ఇకపై నటిస్తుందో లేదో కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మొత్తంగా అయితే ఈ ప్రెగ్నెన్సీ విషయంలో ఇలియానా దాగుడుమూతలు ఆడుతుంది. అసలా ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో, ఇలియానా ఎప్పుడు క్లారిటీ ఇస్తుందో.. చూడాలి.