INDIA
న్యూఢిల్లీ : టీవీల్లో చర్చలను పక్షపాతంగా మార్చేసి, మతం రంగు పులిమే న్యూస్ యాంకర్ల చర్చలకు వెళ్లరాదని ఇండియా బ్లాక్ పార్టీలు నిర్ణయించాయి. పక్షపాతంతో వార్తలను కవర్ చేసే చానళ్లకు వెళ్లరాదని కాంగ్రెస్ చేసిన ప్రతిపాదన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నాయి. బుధవారం నాటి తొలి సమన్వయ కమిటీలో ఈ మేరకు తీర్మానించారు. కొన్ని పార్టీలు ఇటువంటి ఏకపక్ష టీవీ నెట్‌వర్క్‌ల విషయంలో కఠినంగా వ్యవహరించాల్సిందేనని అభిప్రాయపడ్డాయి.
కొందరు పక్షపాతంతో కూడిన వ్యక్తుల ద్వారా అధికార పార్టీ ‘ఇండియా’ కూటమిలో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తుందని, వాటి నుంచి కూటమిని కాపాడుకోవాలని తీర్మానించారు. ఈ మేరకు ఆదిత్య త్యాగి, అమన్ చోప్రా, అమిష్ దేవ్‌గన్, ఆనంద్ నర్సింహన్, అర్ణాబ్ గోస్వామి, అశోక్ శ్రీవాస్తవ్, చిత్రా త్రిపాఠి, గౌరవ్ సావంత్, నవిక కుమార్, ప్రాశ్చి పరాశర్, రుబికా లియాఖత్, శివ్ అరూర్, సుధీర్ చౌదరి, సుశాంత్ సిన్హా నిర్వహించే చర్చలకు హాజరుకారాదని తీర్మానించారు