IRCTC Tourism | ఉడిపి, కుక్కే, శృంగేరి చుట్టొద్దాం రండి..! హైదరాబాదీలకు స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..! ఆరు రోజుల పర్యటన రూ.12వేలకే..!

IRCTC Tourism | పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ శుభవార్తను చెప్పింది. కర్నాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాక ప్రాంతాలను సందర్శించేందుకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. డివైన్‌ కర్నాటక పేరుతో టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు టూర్‌ ప్యాకేజీ కొనసాగనుండగా.. ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో ఉడుపి, శృంగేరి, ధర్మస్థల, కుక్కే, మంగళూరు తదితర ప్రాంతాలను చుట్టిరావొచ్చు. పర్యటన సాగుతుందిలా.. పర్యటన తొలి రోజు హైదరాబాద్‌లో ఉదయం 6.05 […]

IRCTC Tourism | ఉడిపి, కుక్కే, శృంగేరి చుట్టొద్దాం రండి..! హైదరాబాదీలకు స్పెషల్‌ టూర్‌ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్‌సీటీసీ..! ఆరు రోజుల పర్యటన రూ.12వేలకే..!

IRCTC Tourism | పర్యాటకులకు ఐఆర్‌సీటీసీ శుభవార్తను చెప్పింది. కర్నాటకలోని ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాక ప్రాంతాలను సందర్శించేందుకు హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక టూర్‌ ప్యాకేజీని తీసుకువచ్చింది. డివైన్‌ కర్నాటక పేరుతో టూర్‌ ప్యాకేజీని ప్రకటించింది. ఐదు రాత్రులు, ఆరు రోజుల పాటు టూర్‌ ప్యాకేజీ కొనసాగనుండగా.. ప్రతి మంగళవారం అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో ఉడుపి, శృంగేరి, ధర్మస్థల, కుక్కే, మంగళూరు తదితర ప్రాంతాలను చుట్టిరావొచ్చు.

పర్యటన సాగుతుందిలా..

పర్యటన తొలి రోజు హైదరాబాద్‌లో ఉదయం 6.05 గంటలకు మొదలవుతుంది. ప్రయాణికులు ఉదయం 6.05 గంటలకు కాచిగూడ రైల్వే స్టేషన్‌లో మంగళూరు సెంట్రల్ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కాలి. మొదటి రోజంతా జర్నీ ఉంటుంది.

రెండో రోజు ఉదయం 9.30 గంటలకు మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి ఉడిపికి బయలుదేరుతారు. అక్కడ సెయింట్ మేరీస్ ఐల్యాండ్, మాల్పే బీచ్ సందర్శిస్తారు. రాత్రి అక్కడే బస చేయాల్సి ఉంటుంది.

ఇక మూడో రోజు ఉడుపిలోనే శ్రీకృష్ణ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం శృంగేరి బయలుదేరాల్సి ఉంటుంది. శారదాంబ ఆలయాన్ని దర్శనం చేసుకుంటారు. ఆ తర్వాత మళ్లీ మంగళూరు బయలుదేరాల్సి ఉంటుంది.

నాలుగో రోజు ఉదయం ధర్మస్థలలో మంజునాథ స్వామి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆ తర్వాత కుక్కే సుబ్రహ్మణ్యకు బయలుదేరాల్సి ఉంటుంది. అక్కడ సుబ్రహ్మణ్య స్వామి వారిని దర్శనం తర్వాత మళ్లీ మంగళూరుకు బయలుదేరుతారు.

ఐదో రోజు మంగళూరులో స్థానిక పర్యాటక ప్రాంతాలను సందర్శిస్తారు. పిలికుల నిసర్గధామ, మంగళదేవి ఆలయం, కటీల్ ఆలయం, తన్నీర్‌బావి బీచ్ సందర్శిస్తారు. మళ్లీ రాత్రి 9 గంటలకు మంగళూరు సెంట్రల్ రైల్వే స్టేషన్‌లో కాచిగూడ వెళ్లే రైలు ఎక్కాల్సి ఉంటుంది. మరుసటి రోజు రాత్రి 8.05 గంటలకు రైలు కాచిగూడకు చేరుకోవడంతో పర్యటన ముగుస్తుంది.

ప్యాకేజీ ధర ఇలా..

ఐఆర్‌సీటీసీ డివైన్ కర్నాటక టూర్ ధర విషయానికి వస్తే పలు రకాల ప్యాకేజీలను అందుబాటులో ఉంచింది. కంఫర్ట్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరు రూ.15,420, డబుల్ ఆక్యుపెన్సీలో ఒక్కొక్కరు రూ.17,160 చెల్లించాల్సి ఉంటుంది. స్టాండర్డ్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.12,420, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.14,160 చెల్లించాలి. నలుగురి నుంచి ఆరుగురు బుక్ చేసుకుంటే ఈ ప్యాకేజీ ధర వస్తుంది.

కంఫర్ట్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి ఒక్కొక్కరికి రూ.16,320, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.19,820, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.33,170, స్టాండర్డ్‌లో ట్రిపుల్ ఆక్యుపెన్సీకి రూ.13,320, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.16,820, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.30,170 చెల్లించాలి ఉంటుంది.

కంఫర్ట్ కేటగిరిలో థర్డ్ ఏసీ ప్రయాణం, స్టాండర్డ్ కేటగిరిలో స్లీపర్ క్లాస్ ప్రయాణం ఉంటుంది. ఏసీ హోటల్‌లో బస, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్సూరెన్స్‌ కవర్‌ అవుతాయి. పూర్తి వివరాల కోసం http://irctctourism.com వెబ్‌సైట్‌లో సంప్రదించాలని ఐఆర్‌సీటీసీ కోరింది.

వెబ్‌సైలోకి వెళ్లి మొదట హోం పేజీలో Tour Packages కనిపిస్తుంది. పక్కనే ప్రాంతాల పేర్లు కనిపిస్తుంటాయి. అందులో హైదరాబాద్‌పై క్లిక్‌ చేయాలి. పక్కనే డివైన్‌ కర్నాటక పేరుతో ప్యాకేజీ కనిపిస్తుంది. ఆ లింక్‌పై ఓపెన్‌ చేసి టికెట్లు బుక్‌ చేసుకోవచ్చు.