ISRO
విధాత: చంద్రయాన్-3 రాకెట్‌ను శుక్రవారం అంతరిక్షంలోని ప్రయోగించనున్న నేపథ్యంలో ఇస్రో శాస్త్రవేత్తల బృందం గురువారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నది. చంద్రయాన్-3 చిన్న నమూనాతో వచ్చిన బృందం.. వీఐపీ బ్రేక్ దర్శనంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. గురువారం మధ్యాహ్నం 1.05 గంటలకు చంద్రయాన్-3 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం కానున్నది.
#WATCH | Andhra Pradesh | A team of ISRO scientists team arrive at Tirupati Venkatachalapathy Temple, with a miniature model of Chandrayaan-3 to offer prayers.
Chandrayaan-3 will be launched on July 14, at 2:35 pm IST from Satish Dhawan Space Centre, Sriharikota, ISRO had… pic.twitter.com/2ZRefjrzA5
— ANI (@ANI) July 13, 2023
శుక్రవారం మధ్యాహ్నం 2.35 నిలకు చంద్రయాన్-3 రాకెట్‌ను అంతరిక్షంలోకి ప్రయోగించనున్నారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్ లో ఇందుకు సంబంధించిన అన్నిఏర్పాట్లు చేశారు. మరోవైపు ఇస్రో శాస్త్రవేత్తల బృందం శ్రీవారి దర్శించుకోవడం ప్రాధాన్యం సంతరించుకున్నది. మరో వారంరోజుల వ్యవధిలో pslv-c57 రాకెట్ ప్రయోగం చేపట్టనున్నారు. ఆగస్టు నెల చివరి వారంలో ఆదిత్య L1 రాకెట్ ప్రయోగం జరుగనున్నది