KU JAC | కాకతీయ యూనివర్సిటీలో జేఏసీ నిరసన

KU JAC కేసీఆర్ సారు మమ్మల్నీ రెగ్యులర్ చేయాలి వర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఏసీ విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అనేక ఏళ్ల తరబడి అన్ని రకాల విద్యార్హతలు కలిగి చాలీచాలని వేతనాలతో వివిధ యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను తక్షణమే రెగ్యులర్ చేయాలని కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ (KU JAC) చైర్మన్ డాక్టర్ పి కర్ణాకర్ రావు గారు అన్నారు. నేడు కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ […]

  • Publish Date - May 1, 2023 / 09:14 AM IST

KU JAC

  • కేసీఆర్ సారు మమ్మల్నీ రెగ్యులర్ చేయాలి
  • వర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జేఏసీ

విధాత, వరంగల్ ప్రత్యేక ప్రతినిధి: అనేక ఏళ్ల తరబడి అన్ని రకాల విద్యార్హతలు కలిగి చాలీచాలని వేతనాలతో వివిధ యూనివర్సిటీల్లో పని చేస్తున్న కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను తక్షణమే రెగ్యులర్ చేయాలని కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల జేఏసీ (KU JAC) చైర్మన్ డాక్టర్ పి కర్ణాకర్ రావు గారు అన్నారు.

నేడు కాకతీయ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్లు నిన్న రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులరైజేషన్ ప్రక్రియలో యూనివర్సిటీలో పనిచేస్తున్న అధ్యాపకులను పరిగణలోకి తీసుకుపోవడంతోటి తమ నిరసనను వ్యక్తం చేయడం జరిగింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ గతంలో వరంగల్ కు వచ్చిన సందర్భంలో యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల నాయకత్వం సీఎం కేసీఆర్ గారిని కలవడంతో యూనివర్సిటీ అధ్యాపకులను కూడా రెగ్యులరైజ్ చేస్తానని స్పష్టమైన హామీ ఇచ్చినప్పటికీ నిన్న ప్రకటించిన జాబితాలో యూనివర్సిటీలు లేక పోవడంతో తమ భవిష్యత్తు ఏమిటని అర్థం కాక ఒప్పంద అధ్యాపకులు ఆందోళన గురికావడం జరిగిందన్నారు.

కొంతమంది ప్రభుత్వాధికారులు వైస్ ఛాన్స్‌లర్లు వివక్షపూరిత వైఖరి మూలంగా తాము రెగ్యులర్ కాకపోవడం ప్రధాన కారణంగా భావిస్తున్నామని ఇప్పటికైనా సీఎం గారు స్పందించి యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపకుల రెగ్యులర్ చేయాలని కోరడం జరిగింది.

కార్యక్రమంలో కాకతీయ యూనివర్సిటీ కాంట్రాక్ట్ అధ్యాపక జేఏసీ నాయకులు డాక్టర్ చిర్రా రాజు, డాక్టర్ ఫిరో పాషా, డాక్టర్ అంజన్ రావు, డాక్టర్ లక్ష్మారెడ్డి, డాక్టర్ సాదు రాజేష్, డాక్టర్ కనకయ్య మాదాసి, డాక్టర్ సునీత, డాక్టర్ లక్ష్మి, డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ లక్ష్మీనారాయణ, డాక్టర్ గోపీనాథ్, డాక్టర్ సూర్యం డాక్టర్ టి నాగయ్య డాక్టర్ రవి కుమార్ డాక్టర్ డి శ్రీనివాస్ డాక్టర్ ఎల్ జితేందర్ డాక్టర్ లక్ష్మారెడ్డి డాక్టర్ నహీదా పర్వీన్ డాక్టర్ పుల్ల రమేష్, చందులాల్ డాక్టర్ సురేష్ డాక్టర్ రమేష్ తదితరులు 50 మంది అధ్యాపకులు పాల్గొన్నారు.