Jagan
విధాత: మీరంతా నా ఆత్మీయులు, నన్ను మొదటి నుంచీ కనిపెట్టుకుని ఉంటున్నారు. నా అడుగులో అడుగు వేస్తున్నారు. మీలో ఎవర్నీ వదులుకోవడం నాకు ఇష్టం లేదు. మీరంతా నాతో కడవరకూ ఉండాలన్నదే నా ఆశ. కానీ మీరు కట్టు దాటినా.. గీత తప్పినా ఆ తరువాత పరిస్థితులు నా చేతిలో ఉండవు.. ఇక మీదే నిర్ణయం అంటూ జగన్ ఎమ్మెల్యేలకు తియ్యగా వార్నింగ్ ఇచ్చారు.
కాసేపటి క్రితం ఎమ్మెల్యేలతో జగన్ నిర్వహించిన సమీక్షా శిబిరంలో జగన్ తన అభిమతాన్ని వెల్లడించారు. గడపగడపకు ప్రభుత్వం పేరిట నిర్వహిస్తున్న ప్రచారం లాంటి సర్వే కార్యక్రమానికి కొందరు ఎమ్మేల్యేలు పోవడం లేదని, ఇది చాలా తీవ్రమైన తప్పిదంగా పరిగణిస్తూ ఆ ఎమ్మేల్యేల భవిష్యత్ ఇక తన చేతుల్లో ఉండదు అని తేల్చేశారు.
ఐ ప్యాక్ సర్వే ఇంకా వేర్వేరు ఏజెన్సీల ద్వారా చేస్తున్న సర్వేల్లో మెరుగైన రేటింగ్ ఉన్నవాళ్లకు మాత్రమే టికెట్స్ ఇస్తాం అని.. ప్రజల్లో వ్యతిరేకత ఉంటే టికెట్స్ దక్కదు అని తేల్చేశారు. ఇక ఈ లిస్టు లో దాదాపు 18 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు జగన్ సర్వే టీములు గుర్తించినట్లు తెలుస్తోంది.
ఈ పద్దెనిమిది మంది ఎవరన్నది సస్పెన్స్. అక్టోబర్ లోగా తమ పనితీరు మెరుగుపరచుకోకుంటే ప్రజల్లో ఆదరణ లేకపోతే అక్కడి ఆభ్యర్థిని మార్చేస్తామని చెప్పడంతో వీరివీరి గుమ్మడి పండు వీరి పేరేమి ? అన్నట్లుగా మారింది. ఇక జగనన్న సురక్ష ప్రోగ్రాం ద్వారా పాలన ప్రజలకు మరింత చేరువ చేసేందుకు కొత్త కార్యక్రమాన్ని రూపొందించారు.