Jagityala | షటిల్ ఆడుతూ గుండెపోటుతో మృతి
Jagityala విధాత బ్యూరో, కరీంనగర్: గుండెపోటు మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాకింగ్ చేస్తూనో, వ్యాయామం చేస్తూనో, ఆటలు ఆడుతుానో గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తులకు సంబంధించిన ఘటనలు కరీంనగర్ జిల్లాలో ఇటీవల అనేకం చోటు చేసుకున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో తాజాగా అలాంటి ఘటనే జరిగింది. జగిత్యాల జిల్లా క్లబ్ లో అప్పటివరకు తమతో వాకింగ్ చేసి, షటిల్ ఆడుతున్న మిత్రుడు గుండెపోటుతో కుప్పకూలడంతో అతని సహచరులు దిగ్బ్రాంతికి గురయ్యారు. బూస వెంకట రాజగంగారం(53) […]
Jagityala
విధాత బ్యూరో, కరీంనగర్: గుండెపోటు మరణాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. వాకింగ్ చేస్తూనో, వ్యాయామం చేస్తూనో, ఆటలు ఆడుతుానో గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతి చెందిన వ్యక్తులకు సంబంధించిన ఘటనలు కరీంనగర్ జిల్లాలో ఇటీవల అనేకం చోటు చేసుకున్నాయి. జగిత్యాల జిల్లా కేంద్రంలో తాజాగా అలాంటి ఘటనే జరిగింది.
జగిత్యాల జిల్లా క్లబ్ లో అప్పటివరకు తమతో వాకింగ్ చేసి, షటిల్ ఆడుతున్న మిత్రుడు గుండెపోటుతో కుప్పకూలడంతో అతని సహచరులు దిగ్బ్రాంతికి గురయ్యారు. బూస వెంకట రాజగంగారం(53) వాకింగ్ చేసి షటిల్ ఆడుతుండగా ఛాతీలో నొప్పి రావడంతో కుప్ప కూలి క్షణాల్లోనే మృతి చెందాడు…
మిగతా క్రీడాకారులు గమనించి అతడికి సి పి ఆర్ కు చేయగా స్పందించకపోవడంతో వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గంగారాం స్నేహితులతో కలిసి గతంలో గోవా వెళ్ళినప్పుడు కూడా హార్ట్ అటాక్ వచ్చిందని, అప్పుడు సర్జరీ తో ప్రాణాలు కాపాడుకోగలిగారని స్థానికులు చెప్పారు. రాజా గంగారం మృతితో ఆసుపత్రి ఆవరణలో వారి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram