“ఇండియా కూట‌మి”తోనే ఉన్నాం

విప‌క్ష‌ఇండియా కూట‌మితోనే తాము ధ్రుడంగా ఉన్న‌ట్టు జ‌న‌తాద‌ళ్ (యూ) స్ప‌ష్టంచేసింది.

  • Publish Date - January 26, 2024 / 04:29 PM IST

ఎన్డీయేలోకి వెళ్తామ‌నేది వదంతులే

మీడియాకు స్పష్టంచేసిన జేడీయూ

విధాత‌: విప‌క్ష‌ఇండియా కూట‌మితోనే తాము ధ్రుడంగా ఉన్న‌ట్టు జ‌న‌తాద‌ళ్ (యూ) స్ప‌ష్టంచేసింది. ఎన్డీయేలోకి తిరిగి తాము రావాలని యోచిస్తున్నట్టు వస్తున్న వదంతుల‌ను జేడీ (యూ) రాష్ట్ర‌ అధ్యక్షుడు ఉమేష్ సింగ్ కుష్వాహా ఖండించారు. ఇలాంటి వార్త‌లు ఊహాగానాలు మాత్ర‌మేన‌ని పేర్కొన్నారు. తాము ఇప్ప‌టికీ విప‌క్ష ఇండియా కూట‌మిలోనే ఉన్నామ‌ని చెప్పారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ మద్దతుతో జేడీ(యూ) అధినేత నితీశ్‌ కుమార్ ముఖ్యమంత్రిగా మ‌ళ్లీ ప్రమాణ స్వీకారం చేయవచ్చనే వార్తలు పూర్తిగా స‌త్య‌దూమ‌ని పేర్కొన్నారు. భాగస్వాముల మ‌ధ్య‌ సీట్ల భాగస్వామ్యంపై చ‌ర్య‌లు ఉంటాయ‌ని తెలిపారు.

“బీహార్‌లో అధికారంలో ఉన్న మహాఘట్‌బంధన్‌లో అంతా బాగానే ఉన్న‌ది. మీడియాలో ఊహాగానాలు ఏదో ఒక ఎజెండాతో నడపబడుతున్నాయి. నేను నిన్న, ఈ రోజు సీఎంను కలిశాను. ఇది రొటీన్ వ్యవహారమే. ప్రచారం చేస్తున్న పుకార్లలో నిజం లేదు. పార్టీ ఎమ్మెల్యేలను పాట్నాకు హడావుడిగా పిలిచిన‌ట్టు వచ్చిన వదంతుల‌ను కూడా మేము ఖండిస్తున్నాం” అని కుష్వాహా చెప్పారు.

“మా కూటమి భాగస్వామి అయిన కాంగ్రెస్, ఇతర నియోజకవర్గాల పట్ల దాని వైఖరి, సీట్ల పంచుకోవడం గురించి కొంత ఆత్మపరిశీలన చేసుకోవాలని మేము కోరుకుంటున్నాం. మా నాయకుడు నితీశ్‌ కుమార్ చాలా కాలంగా, దాని అవసరాన్ని నొక్కి చెప్పారు. లోక్‌సభ ఎన్నికలపై దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా సీట్ల పంపకాల ఒప్పందాన్ని ముందుగానే ఖరారు చేసింది” అని తెలిపారు.

మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ, కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ కాంగ్రెస్‌తో ముందస్తు ఎన్నికల పొత్తులను తోసిపుచ్చిన నేపథ్యంలో జేడీ (యూ) తాజాగా ఈ వివ‌ర‌ణ వ‌చ్చింది.