Nirmal | మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లోకి చేరికలు

Nirmal | గులాబీ కండువా కప్పిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో బుధవారం పలువురు బీజేపీ నాయకులు.. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సోను మండ‌ల కేంద్రంలో బీజేపీ మండ‌ల అధ్య‌క్షుడు మ్యాక ప్రేమ్ కుమార్, వార్డ్ మెంబ‌ర్, బీజేపీ బూత్ అధ్య‌క్షుడు గంట మ‌హేంద‌ర్, వార్డ్ మెంబ‌ర్ శ్రీకాంత్, పెస‌రి దాము త‌దిత‌రులు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి […]

  • Publish Date - August 23, 2023 / 10:58 AM IST

Nirmal |

  • గులాబీ కండువా కప్పిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

విధాత ప్రతినిధి, ఉమ్మడి ఆదిలాబాద్: నిర్మల్ జిల్లాలో బుధవారం పలువురు బీజేపీ నాయకులు.. బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. సోను మండ‌ల కేంద్రంలో బీజేపీ మండ‌ల అధ్య‌క్షుడు మ్యాక ప్రేమ్ కుమార్, వార్డ్ మెంబ‌ర్, బీజేపీ బూత్ అధ్య‌క్షుడు గంట మ‌హేంద‌ర్, వార్డ్ మెంబ‌ర్ శ్రీకాంత్, పెస‌రి దాము త‌దిత‌రులు మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారు మాట్లాడారు. నిర్మ‌ల్ బీజేపీ నాయ‌కులు సిద్ధాంతాల‌ను మ‌రిచిపోయి, అహంకార‌పూరితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని, కార్య‌క‌ర్త‌ల‌ను కూడా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని వాపోయారు. సీఎం కేసీఆర్ సార‌థ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము బీఆర్‌ఎస్‌లో చేరినట్లు తెలిపారు.

నిర్మ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధి మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డితోనే సాధ్య‌మ‌ని, అందుకే ఆయ‌న వెంట న‌డిచేందుకు బీజేపీని వీడి బీఆర్ఎస్ లో చేరామ‌ని ప్రేమ్ కుమార్ చెప్పారు. నిర్మ‌ల్ గ‌డ్డ మీద మ‌ళ్ళీ ఎగిరేది బీఆర్ఎస్ జెండానే అని స్ప‌ష్టం చేశారు.