Jupally Krishna Rao | కాంగ్రెస్‌లోకి జూపల్లి? రెండు రోజుల్లో ఢిల్లీకి!
నేడో రేపో ఢిల్లీకి.. త్వరలో చేరే అవకాశం విధాత: మాజీ మంత్రి, బీఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణరావు (Jupally Krishna Rao) కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దమైంది. ఆయన క్యాడర్ అంతా కాంగ్రెస్‌లోకి వెళ్లాలని సూచించడంతో ఈ మేరకు కాంగ్రెస్లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా జూపల్లిని కాంగ్రెస్లోకి ఆహ్వానించింది. పార్టీని వీడిన నేతలంతా రావాలని, ప్రత్యేకంగా జూపల్లి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కూడా తమ పార్టీలోకి […]

- నేడో రేపో ఢిల్లీకి.. త్వరలో చేరే అవకాశం
విధాత: మాజీ మంత్రి, బీఆర్ఎస్ బహిష్కృత నేత జూపల్లి కృష్ణరావు (Jupally Krishna Rao) కాంగ్రెస్ పార్టీలో చేరడానికి రంగం సిద్దమైంది. ఆయన క్యాడర్ అంతా కాంగ్రెస్‌లోకి వెళ్లాలని సూచించడంతో ఈ మేరకు కాంగ్రెస్లో చేరేందుకు సిద్దమైనట్లు తెలుస్తోంది.
కాగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకత్వం కూడా జూపల్లిని కాంగ్రెస్లోకి ఆహ్వానించింది. పార్టీని వీడిన నేతలంతా రావాలని, ప్రత్యేకంగా జూపల్లి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు కూడా తమ పార్టీలోకి రావాలని పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి బహిరంగంగా పిలుపు ఇచ్చిన విషయం తెలిసిందే.
జూపల్లి స్వంత నియోజకవర్గంలోని కేడర్ కాంగ్రెస్లోకి వెళ్దామని చెప్పడంతో పాటు, కాంగ్రెస్ నుంచి కూడా అహ్వానం ఉండడంతో అటు దిశగా జూపల్లి అడుగులు వేస్తున్నట్లు ఆయన సన్నిహితులు చెపుతున్నారు.
ఈ మేరకు ఒకటి, రెండు రోజుల్లో ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలను కలుస్తారని విశ్వసనీయ సమాచారం. ఢిల్లీ పెద్దలను కలిసి వచ్చిన తరువాత జూపల్లి తన అనుచరులతో కలిసి అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరతారని విశ్వసనీయంగా తెలిసింది.