KA Paul: సుప్రీంకోర్టులో KA పాల్‌కు చుక్కెదురు

విధాత: తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాద ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం అనవసరమని పాల్ పిటిషన్‌ను కొట్టివేసింది. దేశంలో జరిగే అగ్నిప్రమాదాలపై సీబీఐతో విచారణ జరపమని ఆదేశించాలా అంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, 'నర బలి' జరిగిందని కేఏ పాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు. తన కేసులో […]

  • Publish Date - April 10, 2023 / 09:13 AM IST

విధాత: తెలంగాణ నూతన సచివాలయంలో అగ్నిప్రమాద ఘటనపై సిబిఐ విచారణకు ఆదేశించాలంటూ ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ వ్యవహారంలో కోర్టు జోక్యం అనవసరమని పాల్ పిటిషన్‌ను కొట్టివేసింది.

దేశంలో జరిగే అగ్నిప్రమాదాలపై సీబీఐతో విచారణ జరపమని ఆదేశించాలా అంటూ సుప్రీంకోర్టు అసహనం వ్యక్తం చేసింది. తెలంగాణ సచివాలయంలో జరిగింది అగ్నిప్రమాదం కాదని, ‘నర బలి’ జరిగిందని కేఏ పాల్ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

తన కేసులో తానే స్వయంగా (పార్టీ ఇన్ పర్సన్) పాల్ వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు పాల్ వాదనలను తోసిపుచ్చింది.