కాగ్ నివేదికలో కాళేశ్వరం అక్రమాలు
తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేదని కాగ్ పేర్కొంది

- అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం
విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం కాగ్ నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. కాళేశ్వరం వ్యయం భారీగా పెరిగినప్పటికీ అదనపు ప్రయోజనం లేదని కాగ్ పేర్కొంది. రీ ఇంజినీరింగ్, మార్పుల కారణంగా అప్పటికే చేసిన కొన్ని పనులు నిరర్ధకమయ్యాయని.. దీంతో రూ.765కోట్ల నష్టం వాటిల్లిందని తెలిపింది. పనుల అప్పగింతలో నీటిపారుదల శాఖ అనుచిత తొందరపాటు ప్రదర్శించిందని ఆక్షేపించింది.
డీపీఆర్ ఆమోదానికి ముందే రూ. 25వేల కోట్ల విలువైన 17 పనులు అప్పగించారు. అవసరం లేకున్నా కాళేశ్వరం మూడో టీఎంసీ పనులు చేపట్టారని, దీనివల్ల రూ.25వేల కోట్లు అదనంగా ఖర్చయిందని పేర్కోంది. ప్రాజెక్టు మొత్తం వ్యయం 1లక్ష 47,427కోట్లకు చేరిందని, ప్రాజెక్టు వ్యయం 122శాతం పెరుగగా, ఆయకట్టు 52శాతం మాత్రమే పెరుగనుందన్నారు. సాగునీటిపై మూలధన వ్యయం ఒక్కో ఎకరానికి రూ.6.42లక్షలు అవుతుందని తెలిపింది.
ప్రాజెక్టు ప్రయోజన, వ్యయ నిష్పత్తి 1.51శాతంగా అంచనా వేశారు.. కానీ అది 0.75 శాతంగా తేలుతోందని, అది మరింత తగ్గే అవకాశముందని పేర్కోంది. భూకంప సంబంధిత అధ్యయనాలు సమగ్రంగా చేయకుండానే మల్లన్న సాగర్ నిర్మించారు” అని నివేదికలో కాగ్ పేర్కొంది. కాళేశ్వరం ప్రాజెక్టు డీజైన్ సంస్థ వ్యాప్కోస్ సంస్థ్ పనితీరులో లోపాలున్నాయన్నారు. రీ ఇంజనీరింగ్‌ను కూడా అదే సంస్థకు అప్పగించారన్నారు. ఇప్పటిదాకా కాళేశ్వరంపై 86,788కోట్లు ఖర్చు చేసినట్లుగా పేర్కోంది.