బెంగళూరు: గత బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన మతమార్పిడుల నిషేధ చట్టాన్ని ఉపసంహరించాలని కర్ణాటక (Karnataka)లో కొత్తగా కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.
ప్రలోభపెట్టి, బలవంతం చేసి, మోసపూరితంగా, సామూహికంగా.. ఏ విధంగానూ మత మార్పిడి చేయకూడని పేర్కొంటూ బిల్లును కర్ణాటక అసెంబ్లీ 2021 డిసెంబర్‌లో ఆమోదించింది.
ఈ బిల్లును అమలు చేసేందుకు ఆర్డినెన్స్ తెచ్చింది. 2022 మే 17న గవర్నర్ తావర్‌చంద్ గెహ్లాట్ దానికి ఆమోదం తెలిపారు. దీనిని చట్టంగా మార్చేందుకు ఆరు నెలల్లోపు అసెంబ్లీ ఆమోదం పొందాల్సి ఉంటుంది.
ఈ మేరకు బిల్లును సెప్టెంబర్‌లో అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఆ సమయంలో దీనిని కాంగ్రెస్‌తోపాటు.. పలువురు క్రిస్టియన్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. దానిని ఉపసంహరించాలని నిర్ణయించింది