Karnataka | కూతురిని హత్య చేసిన తండ్రి.. తట్టుకోలేక ప్రియుడు ఆత్మహత్య
Karnataka | ఓ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ ప్రేమికుల కులాలు వేర్వేరు కావడంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. తాను అతన్నే పెళ్లి చేసుకుంటానని కూతురు తెగేసి చెప్పడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన తండ్రి.. ఆమెను అత్యంత దారుణంగా చంపాడు. ప్రియురాలు ఇక లేదన్న వార్త తెలుసుకున్న ప్రియుడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ […]

Karnataka | ఓ ఇద్దరు ప్రేమించుకున్నారు. పెళ్లి కూడా చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ ప్రేమికుల కులాలు వేర్వేరు కావడంతో పెళ్లికి యువతి తల్లిదండ్రులు అంగీకరించలేదు. తాను అతన్నే పెళ్లి చేసుకుంటానని కూతురు తెగేసి చెప్పడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన తండ్రి.. ఆమెను అత్యంత దారుణంగా చంపాడు. ప్రియురాలు ఇక లేదన్న వార్త తెలుసుకున్న ప్రియుడు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కర్ణాటకలోని కోలార్ గోల్డ్ ఫీల్డ్స్‌లో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ పరిధిలోని బంగార్‌పేట గ్రామానికి చెందిన కృష్ణమూర్తికి కృతి అనే కూతురు ఉంది. అయితే ఆమె గంగాధర్(24) అనే యువకుడిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తోంది. వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలనుకున్నారు. గంగాధర్‌ది వేరే కులం కావడంతో కృతి తండ్రి వీరి పెళ్లికి ఒప్పుకోలేదు.
కృతి ప్రేమ గురించి నిన్న ఉదయం కృష్ణమూర్తి ప్రశ్నించాడు. వేరే పెళ్లి చేసుకోవాలని సూచించాడు. గంగాధర్‌నే పెళ్లి చేసుకుంటానని కృతి తెగేసి చెప్పడంతో తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన తండ్రి ఆమెను మట్టుబెట్టాడు. కూతురు గొంతు నులిమి చంపిన కృష్ణమూర్తి.. ఆమె ఉరేసుకున్నట్లు చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. కానీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా తానే చంపినట్లు అంగీకరించాడు కృష్ణమూర్తి.
ఇక కృతి హత్యకు గురైందన్న విషయం గంగాధర్‌కు తెలిసింది. తన ప్రియురాలి లేని ఈ లోకంలో తాను ఉండకూడదని నిర్ణయించుకున్న గంగాధర్.. వేగంగా వస్తున్న రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. గంగాధర్ వృత్తిరీత్యా మేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కృతి హత్య కేసులో కృష్ణమూర్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని, రిమాండ్‌కు తరలించారు.