విధాత, హైదరాబాద్ : గజ్వేల్ ఎమ్మెల్యేగా గెలిచిన బీఆరెస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేందుకు మూహుర్తం ఖరారైంది. ఫిబ్రవరి 1న ఆయన అసెంబ్లీకి వచ్చి ఎమ్మెల్యేగా ప్రమాణం చేయనున్నారు. గజ్వేల్ స్థానం నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ ఎమ్మెల్యేగా కేసీఆర్ గెలిచినప్పటికి తన ఫామ్‌హౌజ్‌లో బాత్‌రూమ్‌లో జారీ పడి తుంటి ఎముక విరగడంతో ఆయన కొత్త అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాలేక ఎమ్మెల్యేల ప్రమాణ కార్యక్రమానికి దూరంగా ఉండిపోవాల్సివచ్చింది. తుంటి ఎముక మార్పిడి ఆపరేషన్ అనంతరం కోలుకుంటున్న కేసీఆర్ ఫిబ్రవరి 1న అసెంబ్లీకి హాజరై ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తారని బీఆరెస్ వర్గాలు వెల్లడించాయి.