Keerthy Suresh |
ప్రముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి సెలబ్రిటీలు, రాజకీయనాయకులు జాతకాలు చెబుతూ తెగ వార్తలలో నిలుస్తూ ఉంటారు. సమంత, నాగ చైతన్య విడిపోతారని ఆయన చెప్పడం వారు నిజంగానే విడి పోవడంతో వేణు స్వామికి ఫుల్ క్రేజ్ ఏర్పడింది. ఇతనితో హీరోయిన్స్ పూజలు చేయించుకునేందుకు క్యూ కడుతున్నారు.
రష్మిక మందన, నిధి అగర్వాల్, డింపుల్ హయతి వంటి హీరోయిన్లు వేణు స్వామితో పూజలు చేయించు కోవడం మనం చూశాం. ఆయన పూజలు చేయించుకుంటే వాళ్లకు మంచి కెరీర్ ఉందని భావించారు. ఇక వేణు స్వామి చెప్పినవన్నీ ఇటీవల జరుగుతూ వస్తున్నాయి. ఆదిపురుష్ సినిమా ఖచ్చితంగా అట్టర్ ఫ్లాప్ అవుతుందని వేణు స్వామి చెప్పగా, ఆయన చెప్పినట్టుగానే ఆదిపురుష్ సినిమా దారుణంగా నిరాశపరచింది.
ఇలా వేణు స్వామి చెప్పినవి జరుగుతూనే రావడంతో.. అతని మీద రోజురోజుకీ చాలామందికి నమ్మకం పెరుగుతూ పోతుంది.ఇప్పుడు మహానటి కీర్తి సురేష్ ఆయన శిష్యురాలిగా మారింది. సాధారణంగా కీర్తి సురేష్ కి ఇలాంటి జాతకాల మీద పెద్దగా నమ్మకం లేకపోయినప్పటికీ తన తల్లి చెప్పడంతో ఆయనతో పూజలు చేయించుకోవాలని అనుకుంటున్నట్టు తెలుస్తుంది.
కీర్తి సురేష్ ఈ మధ్యకాలంలో నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర దారుణంగా నిరాశపరుస్తున్నాయి. చిరంజీవి నటించిన భోళా శంకర్ చిత్రంలో కీర్తి సురేష్ ముఖ్య పాత్ర పోషించింది. ఈ సినిమా ఎంత డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమాలో కీర్తి నటనకి కూడా నెగెటివ్ మార్క్స్ వచ్చాయి. దారుణమైన ట్రోలింగ్ కూడా నడిచింది.
ఈ క్రమంలోనే కీర్తి సురేష్ తల్లి వేణు స్వామితో తన కూతురికి పూజలు చేయించాలని అనుకుంటుందట. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట తెగ వైరల్‌గా మారింది. విషయం తెలుసుకున్న కొందరు అయితే నోరెళ్ల బెడుతున్నారు.
ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వేణు స్వామితో పూజలు చేయించుకున్నాడని అందుకే ఆయన కెరీర్ జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుందని కొందరు అంటున్నారు. మహేష్ నటించిన యువరాజు సినిమా పూజా కార్యక్రమాల సమయంలో.. వేణు స్వామి పాల్గొన్నారు. అప్పుడు వేణు స్వామి.. మహేష్ బాబుతో పూజ చేయించారు. ఇందుకు సంబంధించిన పిక్ కొద్ది రోజులుగా నెట్టింట చక్కర్లు కొడుతుంది.