ఇద్దరు నరబలి.. మహిళల మాంసాన్ని తినేసిన దంపతులు
విధాత: నరబలి ఇస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి, ధనవంతులు అయిపోతారు అని ఓ వ్యక్తి చెప్పిన మాటలకు ఇద్దరు దంపతులు ఆకర్షితులయ్యారు. అతను తీసుకొచ్చి అప్పగించిన ఆ ఇద్దరు మహిళలను అతి కిరాతకంగా చంపేశారు. అంతటితో ఆగకుండా, ఆ మహిళల మాంసాన్ని వండుకుని తిన్నారు. ఈ దారుణ ఘటన కేరళలోని పథనంతిట్ట జిల్లాలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. తిరువళ్ల పట్టణానికి చెందిన ఇద్దరు దంపతులు భగవాల్ సింగ్, లైలా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వీరికి […]
విధాత: నరబలి ఇస్తే ఆర్థిక సమస్యలు తొలగిపోయి, ధనవంతులు అయిపోతారు అని ఓ వ్యక్తి చెప్పిన మాటలకు ఇద్దరు దంపతులు ఆకర్షితులయ్యారు. అతను తీసుకొచ్చి అప్పగించిన ఆ ఇద్దరు మహిళలను అతి కిరాతకంగా చంపేశారు. అంతటితో ఆగకుండా, ఆ మహిళల మాంసాన్ని వండుకుని తిన్నారు. ఈ దారుణ ఘటన కేరళలోని పథనంతిట్ట జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. తిరువళ్ల పట్టణానికి చెందిన ఇద్దరు దంపతులు భగవాల్ సింగ్, లైలా ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. వీరికి షఫీ అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. షఫీ అత్యాచారం కేసులో 2020లో బెయిల్‌పై విడుదలయ్యాడు. అయితే ఇద్దరు మహిళలను నరబలి ఇస్తే మీకు సిరిసంపదలు సమకూరుతాయని భగవాల్, లైలాను నమ్మించాడు.
ఈ క్రమంలో పద్మ, రోసెలిన్ అనే ఇద్దరు మహిళలతో సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకున్నాడు. వీరిద్దరూ లాటరీ టికెట్లు అమ్ముకుంటూ జీవనం కొనసాగిస్తున్నారు. రోసెలిన్‌ను, పద్మను కిడ్నాప్ చేసి, భగవాల్ దంపతులకు అప్పగించాడు. ఇక భగవాల్, లైలా, షఫీ కలిసి ఆ ఇద్దరు మహిళలను తీవ్ర చిత్ర హింసలకు గురి చేశారు.
రొమ్ములపై దాడి చేసి.. 56 ముక్కలుగా నరికారు..
ఇక పద్మ, రోసెలిన్‌ను అతి కిరాతకంగా హత్య చేశారు. రోసెలిన్ రొమ్ములను కత్తితో కట్ చేశారు. రొమ్ముల్లో నుంచి రక్తం చిమ్ముతుంటే పైశాచిక ఆనందం పొందారు. పద్మ శరీరాన్ని 56 ముక్కలుగా నరికారు. ఆ తర్వాత వీరి మాంసాన్ని వండుకుని దంపతులు తిన్నట్లు తెలిసింది. పచ్చి మాంసాన్ని కూడా పీక్కుతిన్నట్లు తెలిసింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారణ చేపట్టారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram