Kharge |
విధాత: నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును, మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌లను ఆహ్వానించలేదని పేర్కొంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
బీజేపీ ప్రభుత్వం ఎప్పటికప్పుడు రాజ్యాంగ వ్యవస్థలను అగౌర పరిచే విధంగా ప్రవర్తిస్తోందని వ్యాఖ్యానించారు. ‘దీనిని బట్టి అర్థమైంది ఏంటంటే.. దళిత, గిరిజన వర్గాల నుంచి రాష్ట్రపతులను రాజకీయ కారణాలకే ఎంపిక చేశారు.
The Modi Govt has repeatedly disrespected propriety.
The Office of the President of India is reduced to tokenism under the BJP-RSS Government.
4/4
— Mallikarjun Kharge (@kharge) May 22, 2023
అధికార పక్షానికి, విపక్షానికి.. ఆ మాటకొస్తే దేశంలో ప్రతి పౌరునికీ ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రపతికి నూతన పార్లమెంటు ప్రారంభోత్సవానికి ఆహ్వానం అందలేదు. ఈ ప్రభుత్వ హయాంలో రాష్ట్రపతి కార్యాలయం టోకెనిజం స్థాయికి పడిపోయింది’ అని వరస ట్వీట్లలో విమర్శించారు.
The President of India Smt. Droupadi Murmu is not being invited for the inauguration of the new Parliament Building.
The Parliament of India is the supreme legislative body of the Republic of India, and the President of India is its highest Constitutional authority.
2/4
— Mallikarjun Kharge (@kharge) May 22, 2023