షూలోకి దూరి ప‌డ‌గ విప్పిన నాగుపాము.. వీడియో వైర‌ల్

విధాత: King Cobra | నాగుపామును చూడ‌గానే ఒళ్లంతా చెమ‌టలు ప‌ట్టేస్తోంది. భ‌యంతో ప‌రుగులు పెడుతాం. ఆ పాము నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాం. మ‌రి అంత‌టి భ‌యంక‌ర‌మైన కింగ్ కోబ్రా ఓ షూలో దూరింది. ఆ త‌ర్వాత ప‌డ‌గ విప్పింది. ఈ దృశ్యం క‌ర్ణాట‌క‌లోని మైసూర్‌లో వెలుగు చూసింది. ఓ యువ‌కుడు ఇంటి ఆవ‌ర‌ణ‌లో షూ వ‌దిలాడు. అయితే షూను ధ‌రించేందుకు వెళ్ల‌గా.. అందులో పాము క‌నిపించింది. భ‌యంతో ప‌రుగులు తీశాడు. పాములు ప‌ట్టే వ్య‌క్తికి స‌మాచారం […]

షూలోకి దూరి ప‌డ‌గ విప్పిన నాగుపాము.. వీడియో వైర‌ల్

విధాత: King Cobra | నాగుపామును చూడ‌గానే ఒళ్లంతా చెమ‌టలు ప‌ట్టేస్తోంది. భ‌యంతో ప‌రుగులు పెడుతాం. ఆ పాము నుంచి త‌ప్పించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తాం. మ‌రి అంత‌టి భ‌యంక‌ర‌మైన కింగ్ కోబ్రా ఓ షూలో దూరింది. ఆ త‌ర్వాత ప‌డ‌గ విప్పింది. ఈ దృశ్యం క‌ర్ణాట‌క‌లోని మైసూర్‌లో వెలుగు చూసింది.

ఓ యువ‌కుడు ఇంటి ఆవ‌ర‌ణ‌లో షూ వ‌దిలాడు. అయితే షూను ధ‌రించేందుకు వెళ్ల‌గా.. అందులో పాము క‌నిపించింది. భ‌యంతో ప‌రుగులు తీశాడు. పాములు ప‌ట్టే వ్య‌క్తికి స‌మాచారం అందించాడు. ఆ ఇంటి వ‌ద్ద‌కు చేరుకున్న పాములు ప‌ట్టే వ్య‌క్తి.. నాగుపామును ప‌ట్టేశాడు. అది ప‌డ‌గ విప్ప‌డంతో స్థానికులు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు.

వానాకాలంలో పాములు బ‌య‌ట‌కు వ‌స్తుంటాయి. కాబ‌ట్టి.. ఇంటి ప‌రిస‌రాల‌ను ప‌రిశుభ్రంగా ఉంచుకోవాలి. అంతే కాకుండా ఇంటి బ‌య‌ట ఉంచిన వ‌స్తువుల‌ను ఒక‌టికి రెండు సార్లు చెక్ చేసుకోవాలి. షూ ధ‌రించే ముందు మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి అని పాములు పట్టే నిపుణులు పేర్కొంటున్నారు.