NTR పార్టీలోకి NTRని ఆహ్వానించడం ఏంటి? పార్టీ జూనియర్‌కు అప్పగించాలి! చంద్రబాబు, లోకేష్‌పై శివాలెత్తిన కొడాలి

విధాత‌: టీడీపీ, చంద్రబాబు, లోకేష్ ఇలాంటి పేర్లు వినిపిస్తే శివాలెత్తిపోయే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని జూనియర్ ఎన్టీయార్ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్రలో ఎన్టీయార్ గురించి ప్రస్తావన రాగా రాష్ట్రం బాగుపడాలి అనే కోరిక.. ఆలోచన ఉన్నవాళ్ళంతా టీడీపీలోకి, రాజకీయాల్లోకి రావచ్చు అన్నట్లుగా మాట్లాడారు. దానికి కౌంటర్‌గా కొడాలి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు పది కాలాలపాటు వినిపించాలంటే పార్టీ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్‌కు ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ […]

  • Publish Date - February 26, 2023 / 01:39 AM IST

విధాత‌: టీడీపీ, చంద్రబాబు, లోకేష్ ఇలాంటి పేర్లు వినిపిస్తే శివాలెత్తిపోయే గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని జూనియర్ ఎన్టీయార్ విషయంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. లోకేష్ పాదయాత్రలో ఎన్టీయార్ గురించి ప్రస్తావన రాగా రాష్ట్రం బాగుపడాలి అనే కోరిక.. ఆలోచన ఉన్నవాళ్ళంతా టీడీపీలోకి, రాజకీయాల్లోకి రావచ్చు అన్నట్లుగా మాట్లాడారు. దానికి కౌంటర్‌గా కొడాలి మాట్లాడుతూ ఎన్టీఆర్ పేరు పది కాలాలపాటు వినిపించాలంటే పార్టీ బాధ్యతలు జూనియర్ ఎన్టీఆర్‌కు ఇవ్వాలని కొడాలి నాని డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్‌ని ఆహ్వానించడమా!!

ఎన్టీఆర్ పెట్టిన పార్టీలోకి జూనియర్ ఎన్టీఆర్‌ను ఆహ్వానించడానికి లోకేష్ ఎవరని నిలదీశారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవని లోకేష్.. జూనియర్ ఎన్టీఆర్‌ను టీడీపీలోకి ఆహ్వానించడమేంటని మండిపడ్డారు. అసలు ఎన్టీఆర్ పార్టీలోకి ఎన్టీఆర్‌ని ఆహ్వానించడం ఏంటి? అని ధ్వజమెత్తారు.

చంద్రబాబు, లోకేష్‌కు విశ్వసనీయత లేదని కొడాలి నాని వ్యాఖ్యానించారు. పార్టీని కాపాడ‌టం తమ వల్ల కాదని చంద్రబాబు, లోకేష్‌లకు అర్థమైందన్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ని లోకేష్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నారని ఎద్దేవా చేశారు.

లోకేష్ కాకుండా బ్రాహ్మణి పోటీ చేసి ఉంటే…

టీడీపీ పగ్గాలు ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పజెబితే టీడీపీకి ప్రతిపక్ష హోదా అయినా వస్తుందని చెప్పారు. చంద్రబాబు, లోకేష్ తమ బొమ్మలతో ఓట్లు అడిగే ధైర్యం వారికి లేదన్నారు. అందుకే జూనియర్ ఎన్టీఆర్‌ని టీడీపీలోకి రమ్మంటున్నారని కొడాలి నాని దుయ్యబట్టారు.

టీడీపీ ఊబి లాంటిదని.. ఆ పార్టీని కాపాడేందుకు ఎవరెళ్లినా కూరుకుపోవడం ఖాయమన్నారు. ఎన్టీఆర్ సొంత నియోజకవర్గం… పామర్రు చంద్రబాబు సొంత నియోజకవర్గం… చంద్రగిరి లోకేష్ పోటీ చేసిన మంగళగిరిలో టీడీపీని గెలిపించుకోలేని వాళ్లు.. టీడీపీని ఏం రన్ చేస్తారని కొడాలి నాని నిలదీశారు.

మంగళగిరిలో లోకేష్ తరపున బ్రాహ్మణి ప్రచారం చేసినా ఓడిపోయాడని గుర్తు చేశారు. లోకేష్ కాకుండా బ్రాహ్మణి పోటీ చేసి ఉంటే గెలిచేదన్నారు. మార్పు కావాల్సింది రాష్ట్రంలో కాదు.. టీడీపీలోనే అని అన్నారు.

జూనియ‌ర్ ఎన్టీఆర్‌కు అవ‌మానం..

తనను వాడుకుని.. ఆ తర్వాత ఎలా అవమానించారో జూనియర్ ఎన్టీఆర్‌కు తెలీదా..? అని కొడాలి నాని ప్రశ్నించారు. 2009 తర్వాత జరిగిన మహానాడులో లోకేష్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌ను అవమానించారని అన్నారు. 2014 ఎన్నికల్లో గెలిచాక ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో జూనియర్ ఎన్టీఆర్‌ను గ్యాలరీలో కూర్చొబెట్టి అవమానించారని కొడాలి నాని మండిపడ్డారు. చంద్రబాబు ఎలాంటి వాడో తన తాత, తండ్రి, మేనత్తలు చెప్పింది జూనియర్ వినే ఉంటాడన్నారు.

Latest News