Kolkata Metro | దేశంలోనే తొలిసారిగా.. న‌ది కింద వేగంగా దూసుకెళ్లిన మెట్రో రైలు.. వీడియో

Kolkata Metro | దేశంలోనే పురాత‌న మెట్రో స‌ర్వీసు కోల్‌క‌తా మెట్రో చ‌రిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా.. న‌ది కింద వేగంగా దూసుకెళ్లింది మెట్రో రైలు. ఈ మెట్రో రైలును హుగ్లీ న‌ది కింద.. హౌరా నుంచి కోల్‌క‌తాలోని ఎస్ల్పానేడ్ వ‌ర‌కు న‌డిపారు. న‌ది కింద మెట్రో రైలు ర‌న్ కోల్‌క‌తా న‌గ‌రానికి చారిత్రాత్మ‌క ఘ‌ట్ట‌మ‌ని కోల్‌క‌తా మెట్రో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పీ ఉద‌య్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హుగ్లీ న‌దిలో 33 మీట‌ర్ల లోతులో మెట్రో […]

Kolkata Metro | దేశంలోనే తొలిసారిగా.. న‌ది కింద వేగంగా దూసుకెళ్లిన మెట్రో రైలు.. వీడియో

Kolkata Metro | దేశంలోనే పురాత‌న మెట్రో స‌ర్వీసు కోల్‌క‌తా మెట్రో చ‌రిత్ర సృష్టించింది. దేశంలోనే తొలిసారిగా.. న‌ది కింద వేగంగా దూసుకెళ్లింది మెట్రో రైలు. ఈ మెట్రో రైలును హుగ్లీ న‌ది కింద.. హౌరా నుంచి కోల్‌క‌తాలోని ఎస్ల్పానేడ్ వ‌ర‌కు న‌డిపారు.

న‌ది కింద మెట్రో రైలు ర‌న్ కోల్‌క‌తా న‌గ‌రానికి చారిత్రాత్మ‌క ఘ‌ట్ట‌మ‌ని కోల్‌క‌తా మెట్రో జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్ పీ ఉద‌య్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. హుగ్లీ న‌దిలో 33 మీట‌ర్ల లోతులో మెట్రో స్టేష‌న్‌ను నిర్మించారు. రాబోయే ఏడు నెల‌ల పాటు హౌరా మైదాన్ నుంచి ఎస్ల్పానేడ్ వ‌ర‌కు ట్ర‌య‌ల్ ర‌న్ కొన‌సాగుతుంద‌ని ఉద‌య్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ ప్రాజెక్టు కోల్‌క‌తా న‌గ‌రానికి చారిత్రాత్మ‌క ఘ‌ట్టం అని పేర్కొన్నారు. ట్రయ‌ల్ ర‌న్ అనంత‌రం ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌న్నారు.

ట్ర‌య‌ల్ ర‌న్‌లో భాగంగా హుగ్లీ న‌ది కింద 520 మీట‌ర్ల దూరాన్ని కేవ‌ల 45 సెక‌న్ల‌లోనే మెట్రో రైలు చేరుకోగ‌లిగింది. అయితే న‌ది కింద సొరంగం న‌ది అడుగున 32 మీట‌ర్ల దిగువ‌న ఏర్పాటు చేశారు. తూర్పు – ప‌శ్చిమ మెట్రో కారిడార్.. కోల్‌కతాలోని ఐటీ హబ్ సాల్ట్ లేక్‌లోని హౌరా మైదాన్, సెక్టార్ Vని కలుపుతోంది. ఈ ప్రాజెక్ట్ కోల్‌కతా మెట్రో నార్త్ – సౌత్ లైన్ ఎస్ల్పానేడ్ స్టేషన్‌ను హౌరా, సీల్దాలోని భారతీయ రైల్వే స్టేషన్‌లతో కలుపుతుంది. 1984లో కోల్‌కతాలో ప్రారంభమైన ఈ మెట్రో రైలు.. దేశంలోనే తొలి మెట్రో రైలుగా కూడా నిలిచింది. 2002లో దేశ రాజధాని ఢిల్లీలో మెట్రో సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. కాలక్రమంలో మిగతా ప్రధాన నగరాల్లో మెట్రో తన సేవలను విస్తరించింది.