Komatireddy
విధాత, ఉమ్మడి నల్గొండ జిల్లా బ్యూరో: నల్లగొండ నుంచి పోటీ చేసేది పక్కా, ఇక్కడ యాభై వేల మెజార్టీతో గెలిపించేది పక్కా అని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. భువనగిరిలోని ఓ హోటల్లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 17న కొంగరకలన్ లో నిర్వహించే బహిరంగ సభకు లక్షలాదిగా జనం తరలిరావాలని పిలుపునిచ్చారు. సోనియా హైదరాబాద్ లో నిర్వహించే భారీ బహిరంగ సభకు పార్టీ లకు అతీతంగా ఉద్యమ కారులు తరలిరావాలని కోరారు. కొన్ని జిల్లాల్లో ఉద్యోగులకు ఇంకా జీతాలు పడలేదన్నారు. ఝార్ఖండ్, బీహార్ లో కూడా జీతాలు పడుతున్నాయని ఎద్దేవా చేశారు.
గతంలో కేసీఆర్ కొంగర కలాన్ లో సభ పెట్టి రూ.500 కోట్లు ఖర్చు పెడితే 4 లక్షల మంది రాలే.. ఇప్పుడు సోనియా సభకు 10 లక్షల మంది కంటే ఎక్కువే వస్తారని చెప్పారు. కేటీఆర్ మాట్లాడుతూ తెలంగాణ పౌరుషం కావాలా? బానిసత్వం కావాలా? అని అడగడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సోనియా తెలంగాణ ఇవ్వకపోతే ఎప్పటికీ రాకపోయి ఉండేదని, ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులతో సోనియాని కలవలేదా? అని ప్రశ్నించారు.
నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వటం లేదని ఆడిగారు. కర్ణాటక లో ఎలాంటి పథకాలు వచ్చాయో, ఇక్కడ కూడా భవిష్యత్ లో అమలు చేస్తామన్నారు. పాలమూరు ప్రాజెక్టు పేరు తో 23 మోటార్లకి ఒక్క మోటార్ తో ప్రారంభించడం ఎన్నికల కోసమేనని విమర్శించారు. 40 ఏళ్ల తరువాత భువనగిరి కోటపై, ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేద్దామన్న ఆయన, నియోజకవర్గ ఇంచార్జి ఏఐసీసీ సభ్యులు చంద్ర శేఖర్ 18న భువనగిరికి వస్తున్నారని పార్టీ నేతలతో సమావేశం నిర్వహిస్తారని వెల్లడించారు.