Komatireddy | కాంగ్రెస్ వస్తే నెల రోజుల్లో TRT నోటిఫికేషన్.. లేదంటే రాజీనామే
Komatireddy విధాతః CM KCR ప్రభుత్వానికి మిగిలివున్న నాలుగునెలల్లో TRT నోటిఫికేషన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెల రోజుల్లో TRT నోటిఫిషన్ ఇప్పిస్తానని, నేనిచ్చిన హామీ అమలుకాకపోతే తెలంగాణ కోసం రాజీనామా చేసినట్లుగా మీ కోసం రాజీనామా చేస్తానని కాంగ్రెస్ స్టార్ క్యాంపయినర్, MP కోమటిరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని కోమటిరెడ్డి నివాసంలో TRT అభ్యర్థులు ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఏళ్లు గడుస్తున్నా TRT చేపట్టడం లేదని MPకి వివరించారు. ఈ […]

Komatireddy
విధాతః CM KCR ప్రభుత్వానికి మిగిలివున్న నాలుగునెలల్లో TRT నోటిఫికేషన్ ఇవ్వకపోతే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే నెల రోజుల్లో TRT నోటిఫిషన్ ఇప్పిస్తానని, నేనిచ్చిన హామీ అమలుకాకపోతే తెలంగాణ కోసం రాజీనామా చేసినట్లుగా మీ కోసం రాజీనామా చేస్తానని కాంగ్రెస్ స్టార్ క్యాంపయినర్, MP కోమటిరెడ్డి స్పష్టం చేశారు. హైదరాబాద్ లోని కోమటిరెడ్డి నివాసంలో TRT అభ్యర్థులు ఆయనను కలిసి తమ సమస్యలను విన్నవించారు. ఏళ్లు గడుస్తున్నా TRT చేపట్టడం లేదని MPకి వివరించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి మాట్లాడుతు మీ తరఫున పోరాటం చేస్తానని, ఇప్పటికే CMకు ఈ అంశంపై లేఖ రాశానన్నారు. ఈ ఆదివారం సాయంత్రం జరిగే పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో TRTపై చర్చిస్తామన్నారు. ఇందిరాపార్క్ దగ్గర 48 గంటల దీక్ష చేసి నిరుద్యోగులకు అండగా ఉంటానన్నారు. అప్పటికి ప్రభుత్వం స్పందించకపోతే నిరసన కార్యక్రమాలు చేద్దామని, అప్పటికీ ప్రభుత్వం దిగిరాకపోతే ప్రగతి భవన్ ను ముట్టడిద్దామన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎవరు CMగా ఉన్న మా మొదటి ప్రాధాన్యత విద్యపై ఉంటుందన్నారు. ప్రభుత్వ బడుల్లో వేలాది టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నా KCR ప్రభుత్వం మాత్రం భర్తీ చేయడం లేదని విమర్శించారు. దీంతో లక్షల మంది పేద పిల్లలకు సరైన విద్య అందడం లేదన్నారు. KCR ఏం చేసినా ఓట్ల కోసమేనన్నారు. ఖాళీగా ఉన్న ఉద్యోగాలు భర్తీ చేయమని అడుగుతుంటే పట్టదా? అని, టీచర్ ఉద్యోగాల కోసం 4 లక్షల మందికి పైగా కోచింగ్ తీసుకున్నారని, ఏళ్లుగా వారు ఎదురుచూస్తున్న నోటిఫికేషన్ ఇవ్వడానికి KCR కు ఎందుకు మనసు రావడం లేదన్నారు. ఓట్ల కోసం స్కీముల పేరుతో మోసాలు చేస్తున్న KCR కు నిరుద్యోగుల బాధలు పట్టవా? అని నిలదీశారు.
ఆనాడు యువత కొట్లాడితేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారని, దీన్ని మర్చిపోవద్దన్నారు. ఎంతో మంది ఆత్మబలిదానాలు చేస్తే.. మరెంతోమంది లాఠీదెబ్బలు తిని తెలంగాణ సాధించుకుంటే సీఎం అయిన KCR నిరుద్యోగులను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ స్కూళ్లలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, టీచర్లు లేక పిల్లలు ప్రైవేట్ స్కూళ్లకు వెళ్తున్నారని, కొందరు చదువుకు దూరం అవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రాథమిక విద్య, వైద్యం పై ఏ ప్రభుత్వం నిర్లక్ష్యం చేయకూడదని, కాని KCR అదే చేశారన్నారు. ఆరోగ్య శ్రీ ని నిర్వీర్యం చేశారని, టీచర్ల భర్తీ లేదని, 6వేల స్కూళ్లు మూతబడ్డాయని, ఫీజు రీయింబర్స్ బకాయిలు ఇవ్వడం లేదన్నారు. రెండు పర్యాయాలు అవకాశం ఇస్తే KCR ఏం చేయకపోగా, ఆఖరికి ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఉందన్నారు. తన తాత చేస్తున్న నిర్లక్ష్య పాలనపై హిమాన్షు ఓ స్కూల్ దుస్థితిపై చెబుతూ చక్కగా వివరించాడన్నారు. స్కూళ్ల విషయంలో ఏపీ సీఎం జగన్ ప్రభుత్వాన్ని చూసి CM KCR నేర్చుకోవాలని హితవు పలికారు.