KTR | సీఎం రేవంత్‌రెడ్డి మాటలన్ని బుడ్డర్ ఖాన్ మాటలే
సీఎం రేవంత్‌రెడ్డి బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నాడని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్‌లో శనివారం జరిగిన సనత్‌నగర్ నియోజకవర్గ బీఆరెస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు

- ఆరు గ్యారంటీలకు సగం నిధులివ్వలేదు
- ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిరాశజనకం
- బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
KTR | విధాత : సీఎం రేవంత్‌రెడ్డి బుడ్డర్‌ఖాన్‌లా మాట్లాడుతున్నాడని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్‌లో శనివారం జరిగిన సనత్‌నగర్ నియోజకవర్గ బీఆరెస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తేనే ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని రేవంత్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలుకు రూ.1.25 లక్షల కోట్లు అవసరమవుతాయని, కానీ బడ్జెట్‌లో మాత్రం కేవలం రూ.53 వేల కోట్ల మాత్రమే కేటాయించారని కేటీఆర్ విమర్శించారు.
ప్రతి కరెంటు మీటర్‌కు 200 యూనిట్లకు ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని కేటీఆర్ హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ నిరాశజనకంగా ఉందని విమర్శించారు. తెలంగాణ జల హక్కులను కృష్ణాబోర్డుకు అప్పగించడాన్ని నిరసిస్తూ 13న నల్లగొండలో పెద్ద ఎత్తున సభ నిర్వహిస్తున్నామని చెప్పారు.
ఈ సమావేశలో మాజీ మంత్రి, ఎమ్మెల్సీ మహమూద్ అలీ, మాజీ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పద్మారావు , ఎమ్మెల్యేలు దానం నాగేందర్, మాగంటి గోపినాథ్ , ముఠా గోపాల్, పాడి కౌశిక్ రెడ్డి, సికింద్రాబాద్ పార్లమెంటరీ ఇంచార్జి తలసాని సాయికిరణ్ యాదవ్, సనత్ నగర్ నియోజకవర్గ డివిజన్ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షలు, మాజీ అధ్యక్షలు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, బీఆర్ఎస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.