సీఎం కేసీఆర్‌ను కలిసిన కూసుకుంట్ల, నల్లగొండ నేతలు

Kusukuntla Prabhaker Reddy | మునుగోడు ఉప ఎన్నికలో విజయ సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిశారు. మునుగోడులో అవ‌కాశం ఇచ్చి గెలిపించినందుకు సీఎం కేసీఆర్‌కు ఆయ‌న ప్రత్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. సీఎంను ప‌లువురు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేత‌లు కూడా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన నేత‌ల‌ను అభినందించారు. మునుగోడులు ఇచ్చిన హామీల అమ‌లును మొద‌లు పెట్టాల‌ని సూచించారు. అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని […]

సీఎం కేసీఆర్‌ను కలిసిన కూసుకుంట్ల, నల్లగొండ నేతలు

Kusukuntla Prabhaker Reddy | మునుగోడు ఉప ఎన్నికలో విజయ సాధించిన టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్ర‌భాక‌ర్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ను ప్ర‌గ‌తిభ‌వ‌న్‌లో క‌లిశారు. మునుగోడులో అవ‌కాశం ఇచ్చి గెలిపించినందుకు సీఎం కేసీఆర్‌కు ఆయ‌న ప్రత్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.

సీఎంను ప‌లువురు ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ నేత‌లు కూడా క‌లిశారు. ఈ సంద‌ర్భంగా కేసీఆర్ మునుగోడులో టీఆర్ఎస్ గెలుపు కోసం కృషి చేసిన నేత‌ల‌ను అభినందించారు. మునుగోడులు ఇచ్చిన హామీల అమ‌లును మొద‌లు పెట్టాల‌ని సూచించారు. అధికారుల‌తో స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డికి సీఎం సూచించారు.ఽ

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్ఎస్, బీజేపీ పార్టీల మధ్య హోరాహోరీ పోరు కొనసాగిన విషయం తెలిసిందే. కేవలం 10,113 ఓట్ల మెజార్టీతో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపొందారు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి 96,598 ఓట్లు పోలవ్వగా, ప్రత్యర్థి రాజగోపాల్ రెడ్డికి 86,485 ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ అభ్యర్థి పాల్వాయి స్రవంతి డిపాజిట్ కోల్పోయారు. ఆమెకు కేవలం 23,864 ఓట్లు మాత్రమే వచ్చాయి. బీఎస్పీకి 4,145, కేఏ పాల్ కు 805, నోటాకు 482 ఓట్లు వచ్చాయి.