Lakshmi Parvati | పురందేశ్వరిపై.. లక్ష్మీపార్వతి గుస్సా
Lakshmi Parvati | తనను అవమానించారని ఆవేదన విధాత: ఎన్టీయార్ పేరిట రూ. 100 నాణెం విడుదల సందర్భంగా ఎన్టీయార్ కుటుంబం తనను ఘోరంగా అవమానించిందని అయన సతీమణి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఎన్టీయార్ జీవించి ఉన్న రోజుల్లో పెట్టినవాళ్లంతా ఇప్పుడు అయన మరణించిన తరువాత ఆయన్ను పొగుడుతున్నారని, ఇదంతా రాజకీయ లబ్ధికోసమే అని ఆమె ఆరోపించారు. పురందేశ్వరి ఎక్కడ పోటీ చేస్తే అక్కడకు తానువెళ్ళి ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తానని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. ఆ నాణెం […]

Lakshmi Parvati |
- తనను అవమానించారని ఆవేదన
విధాత: ఎన్టీయార్ పేరిట రూ. 100 నాణెం విడుదల సందర్భంగా ఎన్టీయార్ కుటుంబం తనను ఘోరంగా అవమానించిందని అయన సతీమణి లక్ష్మీపార్వతి ఆరోపించారు. ఎన్టీయార్ జీవించి ఉన్న రోజుల్లో పెట్టినవాళ్లంతా ఇప్పుడు అయన మరణించిన తరువాత ఆయన్ను పొగుడుతున్నారని, ఇదంతా రాజకీయ లబ్ధికోసమే అని ఆమె ఆరోపించారు.
పురందేశ్వరి ఎక్కడ పోటీ చేస్తే అక్కడకు తానువెళ్ళి ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం చేసి ఓడిస్తానని లక్ష్మీపార్వతి హెచ్చరించారు. ఆ నాణెం అందుకునేందుకు తనకు మాత్రమే అర్హత ఉందని, ఆయన్ను వేధించుకు తినేసిన వీళ్లంతా ఇప్పుడు ఎందుకు హడావుడి చేస్తున్నారని ఆమె ప్రశ్నించారు. ఆ కుటుంబంలో భువనేశ్వరి, పురందేశ్వరి ప్రధాన విలన్ పాత్రధారులు అని లక్ష్మీపార్వతి ఆరోపించారు.
మరోవైపు ఆమె రాష్ట్రపతి భవన్ కు లేఖ రాసి తనను ఎందుకు పిలవలేదని ప్రశ్నించగా అదసలు అధికారిక కార్యక్రమం కాదని, ఓ ప్రయివేటు కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పిలిస్తే ఆమె వెళ్లినట్లు రాష్ట్రపతి భవన్ నుంచి సమాధానం వచ్చింది.
దీంతో టీడీపీ వాళ్ళు ఇంత హడావుడి చేసింది ఓ ప్రయివేట్ కార్యక్రమానికా అని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులూ వెక్కిరిస్తున్నారు. మరోవైపు చంద్రబాబు ఇదే సందర్భంగా బిజెపి జాతీయ అధ్యక్షుడు జయప్రకాశ్ నడ్డాను సైతం కలిశారు. అనంతరం ఎన్నికల కమిషన్ ను కలిసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తోందని ఆరోపించారు.