Maharashtra | విరిగిపడ్డ కొండచరియలు.. నలుగురు మృతి
Maharashtra మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా వంద రైళ్లు రద్దు… పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్ పలు జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు బీభత్సం సృష్టిస్తున్న వానలు విధాత: మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముంబై, పరిసర ప్రాంతాలుసహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు నలుగురు చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు. #इर्शाळवाडी येथील दरड कोसळलेल्या दुर्घटना स्थळाच्या दिशेने चालत असताना वाटेत काही ग्रामस्थ […]

Maharashtra
- మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా
- వంద రైళ్లు రద్దు… పలు జిల్లాలకు రెడ్ అలెర్ట్
- పలు జిల్లాల్లో నేడు స్కూళ్లకు సెలవు
- బీభత్సం సృష్టిస్తున్న వానలు
విధాత: మహారాష్ట్రలో వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ముంబై, పరిసర ప్రాంతాలుసహా రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో భారీ వానలు పడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు నలుగురు చనిపోయారు. ముగ్గురు గాయపడ్డారు.
#इर्शाळवाडी येथील दरड कोसळलेल्या दुर्घटना स्थळाच्या दिशेने चालत असताना वाटेत काही ग्रामस्थ मला भेटले. त्यांची आस्थेने विचारपूस करून प्रत्यक्ष परिस्थिती देखील जाणून घेतली. तसेच त्यांना धीर देत सरकार तुम्हाला शक्य ती सारी मदत करेल असे आश्वस्त केले.
मातीच्या ढिगाऱ्याखाली अडकलेल्या… pic.twitter.com/ThsosJKc5t
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) July 20, 2023
బుధవారం 100కి పైగా లోకల్ రైళ్లను రద్దు చేశారు. భారత వాతావరణ శాఖ (IMD) రాయ్‌ఘడ్‌కు రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాయ్‌గఢ్ జిల్లా ఖలాపూర్ తహసీల్‌లోని ఇర్షల్‌వాడి గ్రామంలో అర్థరాత్రి కొండచరియలు విరిగిపడటంతో 30 కుటుంబాలు చిక్కుకున్నాయని అధికారులు తెలిపారు. ఎన్‌డీఆర్‌ఎఫ్ ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
#रायगड जिल्ह्यातील #खालापूर जवळील #इर्शाळवाडी या दुर्घटनाग्रस्त गावाला भेट देऊन येथील परिस्थितीचा आणि सुरू असलेल्या मदतकार्याचा आढावा घेतला.
या दुर्घटनेत १२ जणांचा मृत्यू झाला आहे. काही ग्रामस्थ भातशेतीच्या कामासाठी इतरत्र गेले असून गावातील काही मुले आश्रमशाळेमध्ये शिक्षण घेत… pic.twitter.com/faoC8wAK7R
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) July 20, 2023
ఘటనాస్థలాన్ని సందర్శించిన సీఎం
ఈ ఘటనలో నలుగురు వ్యక్తులు మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. ఆ ఘటనా స్థలాన్ని మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండే గురువారం సందర్శించారు. మృతుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. క్షతగాత్రుల చికిత్స ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని తెలిపారు. కొండచరియలు విరిగిపడిన ఘటనపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కూడా సంతాపం తెలిపారు.
#रायगड जिल्ह्यातील #खालापूर जवळील #इर्शाळवाडी येथे दरड कोसळून झालेल्या दुर्घटनेतील मदतकार्याला वेग देण्यासाठी मी स्वतः घटनास्थळी चालत जाण्याचा निर्णय घेतला आहे.
मी स्थानिक नागरिकांना केलेल्या आवाहनाला प्रतिसाद देऊन #एनडीआरएफ पथकाच्या मार्गदर्शनाखाली मदतकार्याला वेग देण्यासाठी… pic.twitter.com/4AUCXf8gIU
— Eknath Shinde – एकनाथ शिंदे (@mieknathshinde) July 20, 2023
థానే, పాల్ఘర్, రాయ్‌గఢ్‌లలో విద్యాసంస్థలకు సెలవు ప్రకటించాలని మహారాష్ట్ర విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (MMR)లో భారీ వర్షపాతం హెచ్చరిక కారణంగా ముంబై, థానే, రాయ్‌ఘడ్, పాల్ఘర్‌తో సహా నాలుగు జిల్లాల్లోని అన్ని పాఠశాలలకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం సెలవు ప్రకటించింది