Landslides | కేరళలో ఘోరం.. విరిగిపడ్డ కొండచరియలు.. ఏడుగురు దుర్మరణం
Landslides | కేరళ (Kerala) లో ఘోరం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున వాయనాడ్ (Wayanad) జిల్లాలోని మెప్పాడి (Meppadi) సమీపంలోని పలుచోట్ల భారీగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు.

Landslides : కేరళ (Kerala) లో ఘోరం జరిగింది. మంగళవారం తెల్లవారుజామున వాయనాడ్ (Wayanad) జిల్లాలోని మెప్పాడి (Meppadi) సమీపంలోని పలుచోట్ల భారీగా కొండచరియలు (Landslides) విరిగిపడ్డాయి. ఈ ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ఇంకా చాలా మంది కొండచరియల కింద చిక్కుకుని ఉన్నట్టు స్థానికులు చెబుతున్నారు.
కాగా, ప్రమాద సమాచారం అందిన వెంటనే కేరళ రాష్ట్ర విపత్తు నిర్వహణ దళం (KSDMA), అగ్నిమాపక బృందం, జాతీయ విపత్తు స్పందన దళాలు (NDRF) ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. సమీపంలోని ప్రాంతాల నుంచి అదనపు బృందాలు సైతం వయనాడ్‌కు చేరుకుని సహాయక చర్యల్లో పాల్గొంటున్నాయి.
కాగా కొండచరియల కింద ఇంకా చాలా మంది చిక్కుకుపోయి ఉంటారని స్థానికులు ఆందోళన వ్యక్తంచేశారు. భారీ వర్షాలు కురుస్తుండటంతో సహాయక చర్యలకు అంతరాయం కలుగుతోంది. కాగా కేరళలో గత కొన్ని రోజులుగా ఎడతెరపిలేకుండా వర్షం కురుస్తుండటంతో కొండచరియలు విరిగిపడుతున్నాయి.