సూపర్ ప్లాన్: నెలకు రూ.1,800తో.. రూ.8 లక్షల ఆదాయం
ఎల్ఐసీ ఆధార్ షీలా ప్లాన్ గురించి తెలుసా.. విధాత: పెట్టుబడి అనేది ఓ జీవితకాల సంబంధ అంశం. మీ కష్టార్జితాన్ని మార్కెట్‌లో సరైన చోట ఇన్వెస్ట్ చేస్తే ఆకర్షణీయ లాభాలను పొందవచ్చు. అలాంటి వాటిలో ఎల్ఐసీ ఆధార్ షీలా ప్లాన్ ఒకటి. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో పొదుపుతోపాటు బీమా భరోసా కూడా ఉంటుంది. మహిళల కోసం.. దీన్ని మహిళలే లక్ష్యంగా ఎల్ఐసీ తెచ్చింది. అందుకే ఈ ప్లాన్‌ను రక్షణ, పొదుపు ప్రయోజనాలతో రూపొందించారు. దీనితో కుటుంబానికి […]
ఎల్ఐసీ ఆధార్ షీలా ప్లాన్ గురించి తెలుసా..
విధాత: పెట్టుబడి అనేది ఓ జీవితకాల సంబంధ అంశం. మీ కష్టార్జితాన్ని మార్కెట్‌లో సరైన చోట ఇన్వెస్ట్ చేస్తే ఆకర్షణీయ లాభాలను పొందవచ్చు. అలాంటి వాటిలో ఎల్ఐసీ ఆధార్ షీలా ప్లాన్ ఒకటి. ప్రభుత్వ రంగ సంస్థ కావడంతో పొదుపుతోపాటు బీమా భరోసా కూడా ఉంటుంది.
మహిళల కోసం..
దీన్ని మహిళలే లక్ష్యంగా ఎల్ఐసీ తెచ్చింది. అందుకే ఈ ప్లాన్‌ను రక్షణ, పొదుపు ప్రయోజనాలతో రూపొందించారు. దీనితో కుటుంబానికి ఆర్థికంగా దన్ను లభించడమేగాక, దురదృష్టవశాత్తు పాలసీదారుడు చనిపోతే పాలసీ వ్యవధి పూర్తయ్యాక ఎంతైతే వస్తుందో.. అంతే మొత్తం ఒకేసారి మెచ్యూరిటీతో సంబంధం లేకుండా వస్తుంది.
రుణ సదుపాయం
ఈ ప్లాన్‌పై పాలసీదారులకు ఆటో కవరేజీ, రుణ సదుపాయాలు కూడా ఉంటాయి. ఇక రోజుకు సుమారు రూ.59 ఇన్వెస్ట్ చేస్తే నెలకు దాదాపు రూ.1,800, ఏటా రూ.21,469 అవుతుంది. 20 ఏండ్లలో రూ.4,29,392గా ఉంటుంది. ఈ మొత్తంపై మెచ్యూరిటీ సమయంలో రూ.7,94,000 అందుకోవచ్చు.
ఎవరు అర్హులు?
8-55 ఏండ్ల మధ్య వయసున్న ఎవరైనా ఈ ప్లాన్‌కు అర్హులే. మెచ్యూరిటీకి గరిష్ఠ వయస్సు 70 ఏండ్లు. పాలసీ వ్యవధి 10 నుంచి 20 సంవత్సరాలుగా ఉంటుంది. ఇక పాలసీదారుడు చనిపోతే నామినీకి కనిష్ఠంగా రూ.75,000. గరిష్ఠంగా రూ.3 లక్షలు అందుతాయి.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram