లోక్‌సభ నుంచి 33 మంది ఎంపీల సస్పెన్షన్
లోక్‌సభ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కూడా పార్లమెంట్‌లో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు

- పార్లమెంట్‌లో భద్రతాలోపంపై కేంద్ర హోంమంత్రి
- అమిత్ షా ప్రకటన చేయాలని విపక్షం డిమాండ్
- స్పీకర్ పోడియం ఎదుట ప్లకార్డుల ప్రదర్శన
- ఆందోళన చేపట్టిన సభ్యులపై స్పీకర్ చర్యలు
విధాత: లోక్‌సభ భద్రతా ఉల్లంఘనపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం కూడా పార్లమెంట్‌లో విపక్ష సభ్యులు ఆందోళన చేపట్టారు. లోక్‌సభ ప్రారంభం కాగానే స్పీకర్ పోడియం ఎదుట ఎంపీలు ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కాంగ్రెస్ అగ్రనేత అధిర్ రంజన్ చౌదరితో సహా 32 మంది ప్రతిపక్ష ఎంపీలను సస్పెండ్ చేశారు.
లోక్‌సభలో భద్రతా లోపంపై గతవారం నుంచి విపక్ష సభ్యులు ఆందోళన చేపడుతూ వస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా స్పందించాలని డిమాండ్ చేస్తూ వస్తున్నారు. విపక్ష సభ్యుల ఆందోళనలతో సభ వరుసగా వాయిదాపడుతూ వస్తున్నది. సోమవారం కూడా విపక్ష ఆందోళన చేపట్టడంతో 30 మంది విపక్ష సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.