Kiran Kumar Reddy | నన్ను పట్టించుకోండి అధ్యక్షా.. BJPలో చేరిన కిరణ్ కుమార్ రెడ్డి ఆవేదన

Kiran Kumar Reddy విధాత‌: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సీఎం గా పని చేసారు.. స్పీకర్ గా చేసారు.. కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం విప్ గా పని చేసారు. రాష్ట్ర విభజనను ఆపుతానని, లాస్ట్ బాల్ ఉంది.. అప్పుడే మ్యాచ్ మలుపు తిప్పుతానని అన్నారు.. మొత్తానికి ఏదీ చేయలేక.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు. రాష్ట్ర విభజన దెబ్బతో 2014 ఎన్నికల్లో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఐతే […]

  • Publish Date - June 3, 2023 / 12:39 PM IST

Kiran Kumar Reddy

విధాత‌: నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు సీఎం గా పని చేసారు.. స్పీకర్ గా చేసారు.. కాంగ్రెస్ పార్టీ శాసనసభ పక్షం విప్ గా పని చేసారు. రాష్ట్ర విభజనను ఆపుతానని, లాస్ట్ బాల్ ఉంది.. అప్పుడే మ్యాచ్ మలుపు తిప్పుతానని అన్నారు.. మొత్తానికి ఏదీ చేయలేక.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రిగా చరిత్రలో నిలిచిపోయారు.

రాష్ట్ర విభజన దెబ్బతో 2014 ఎన్నికల్లో ఆంధ్రాలో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. ఐతే తాను సమైక్యాంధ్ర కోసం పోరాడతానని చెప్పుకున్న కిరణ్ కుమార్ రెడ్డి సమైక్యాంధ్ర పేరుతొ పార్టీ పెట్టి చెప్పుల గుర్తు మీద పోటీ చేయగా ఏమీ బావుకున్నది లేదు.

దీంతో ఏపీలో చేసేదేం లేక ఇన్నాళ్లు రెస్ట్ తీసుకున్నారు. ఇప్పుడు పదేళ్ల గ్యాప్ తరువాత మళ్ళీ రాజకీయాలు చేద్దాం అని డిసైడ్ అయ్యారు.. టిడిపిలో చేరలేరు.. కాంగ్రెసును ఈయన మోయలేరు.. జగన్ పార్టీలోకి ఛాన్స్ లేదు.. దీంతో రెండు నెలల కిందట బీజేపీలో చేరారు.

బలమైన రెడ్డి సామాజికవర్గానికి చెందిన కిరణ్ కుమార్ రెడ్డి చేరిక బిజెపికి లాభిస్తుందని, పలువురు మాజీ ఎమ్మెల్యేలు, కింది స్థాయి కార్యకర్తలు పార్టీలో చేరతారని బిజెపి అధిష్టానం భావించింది. అంతేకాకుండా అయన పార్టీకి జవసత్వాలు తెచ్చి పరుగులు పెట్టిస్తారని కూడా ఆశపడ్డారు.

అయితే ఇప్పుడు ఒక్క మాజీ ఎమ్మెల్యే కూడా చేరకపోగా.. అసలు కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో ఉన్నారో లేదో తెలియని పరిస్థితి. దీంతో ఆయనలో నిర్వేదంతో కూడిన నైరాశ్యం ఆవహించింది. నన్ను ఎవరూ పిలవడం లేదు.. పట్టించుకోవడమూ లేదు… ఏదైనా బాధ్యత అయినా ఇస్తారు అనుకుంటే అదీ లేదు.. ఇలా ఎందుకు చేరానా అని ఇబ్బందిగా ఫీలవుతున్నారు.

తెలంగాణ ఎన్నికల్లో బిజెపి కాస్త గట్టిగా పోటీ ఇచ్చే అవకాశం ఉండడంతో అక్కడ ఆయన సేవలు వినియోగించుకుంటారేమో అని ఆయన ఆశించినా అక్కడ బండి సంజయ్, కిషన్ రెడ్డి, ఇతర నేతలు ఆయన్ను కనీసం పిలవడం లేదు. మా స్టేట్ సంగతి మేం చూసుకుంటాం.

మీరు ఆంధ్ర నుంచి వచ్చి చేసేదేం లేదని వారు అసలు హైద్రాబాద్ రానివ్వడం లేదు. ఇక ఆంధ్రలో బిజెపి చేయడానికి ఏమి లేదు.. దీంతో నేను పార్టీలో చేరి రెండు నెలలు అయింది.. నన్ను ఎవరూ పట్టించుకోవడం లేదని అయన లోలోన బాధపడుతున్నట్లు తెలుస్తోంది.