ప్రియురాలిని 35 ముక్కలుగా నరికేశాడు.. ఒక్కో ఏరియాలో ఒక్కో భాగం..
Love Affair | మనసులు కలిశాయి.. మనువాడాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు తిరస్కరించారు.. చేసేదేమీ లేక ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ.. ప్రియురాలిని అతి కిరాతకంగా నరికి చంపాడు ప్రియుడు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, ఒక్కో భాగాన్ని ఒక్కో ఏరియాలో పడేశాడు. ఈ అత్యంత దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది. వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన శ్రద్ధా(26) స్థానికంగా ఉన్న ఓ మల్టీ […]

Love Affair | మనసులు కలిశాయి.. మనువాడాలనుకున్నారు. కానీ కుటుంబ సభ్యులు తిరస్కరించారు.. చేసేదేమీ లేక ఇంట్లో ఎవరికి చెప్పకుండా వెళ్లిపోయారు. అంతలోనే ఏం జరిగిందో తెలియదు కానీ.. ప్రియురాలిని అతి కిరాతకంగా నరికి చంపాడు ప్రియుడు. ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి, ఒక్కో భాగాన్ని ఒక్కో ఏరియాలో పడేశాడు. ఈ అత్యంత దారుణ ఘటన దేశ రాజధాని ఢిల్లీలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. ముంబైకి చెందిన శ్రద్ధా(26) స్థానికంగా ఉన్న ఓ మల్టీ నేషనల్ కంపెనీలో పని చేస్తోంది. ఆమెకు అక్కడే అఫ్తబ్ అమీన్ పూనావాలా పరిచయం అయ్యారు. వారి పరిచయం కాస్త ప్రేమకు దారి తీసింది. మనసులు కలియడంతో పెళ్లి చేసుకోవాలనుకున్నారు. ఇదే విషయాన్ని శ్రద్ధా తన కుటుంబ సభ్యులకు తెలిపింది. శ్రద్ధా తల్లిదండ్రులు వీరి ప్రేమను తిరస్కరించారు.
ఈ క్రమంలో శ్రద్ధా, పూనావాలా కలిసి ఢిల్లీకి వచ్చారు. ఢిల్లీలోని మెహ్రౌలీలో ఓ అద్దె గదిలో నివాసం ఉంటున్నారు. అయితే శ్రద్ధా నవంబర్ మొదటి వారంలో తన పేరెంట్స్ ఫోన్ కాల్స్‌కు సమాధానం ఇవ్వలేదు. ఫోన్ స్విచ్ఛాప్‌గా ఉంది. దీంతో శ్రద్ధా తండ్రి వికాస్ మదన్‌కు అనుమానం వచ్చి.. ఢిల్లీకి చేరుకున్నాడు. నవంబర్ 8వ తేదీన మెహ్రౌలీకి చేరుకోగా, తన బిడ్డ కనిపించలేదు. వికాస్ మెహ్రౌలీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తులో భాగంగా పూనావాలాను అరెస్టు చేశారు.
శ్రద్ధాను తానే చంపినట్లు పూనావాలా అంగీకరించాడు. ఆమెను నరికి చంపానని తెలిపాడు. శరీరాన్ని 35 ముక్కలుగా నరికేశానని చెప్పాడు. ఆ తర్వాత ఫ్రిజ్ తీసుకొచ్చి.. దాంట్లో 18 రోజుల పాటు శరీర భాగాలను దాచానని పేర్కొన్నారు. ఇక అర్థరాత్రి 2 గంటల సమయంలో ఆ శరీర భాగాలను తీసుకొని, ఢిల్లీలోని పలు ఏరియాల్లో విసిరేసినట్లు పూనావాలా పేర్కొన్నాడు. వివాహం విషయంలో ఇద్దరి మధ్య వివాదాలు తలెత్తాయని, ఈ క్రమంలోనే శ్రద్ధాను చంపానని పూనావాలా ఒప్పుకున్నాడు. ఇక శ్రద్ధా శరీర భాగాలను వెతికే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు.