Maanas |
ఇటీవల చాలా మంది సెలబ్రిటీలు వైవాహిక జీవితంలోకి అడుగుపెడుతున్న విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ మానస్ నిశ్చితార్థం జరుపుకున్నాడు. మానస్ బిగ్ బాస్ షోతో మంచి గుర్తింపు తెచ్చుకోగా, హౌజ్‌లో ట్రాన్స్‌జెండర్ ప్రియాంకతో చాలా సన్నిహితంగా ఉండేవాడు. ఇక ప్రియాంక సైతం మానస్‌తో చాలా ప్రేమగా ఉండేది.
ప్రియాంక సింగ్.. అందరినీ అన్న అంటూ పిలిచేది కానీ మానస్‌ను మాత్రం అలా పిలవలేదు. ఆయన కోసం తెగ తపించిపోతున్నట్టు కనిపించింది. కాని తర్వాత మానస్.. ప్రియాంక సింగ్‌కి పూర్తి క్లారిటీ ఇవ్వడంతో ఆమె కాస్త సైడ్ అయింది. హౌజ్ నుండి బయటకు వచ్చాక వారిద్దరు ఫ్రెండ్స్ మాదిరిగా ఉన్నారు. అయితే బిగ్‌బాస్ తర్వాత మానస్ లేడీస్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు.
శనివారం సెప్టెంబర్ 2 సాయంత్రం మానస్ అందరికి పెద్ద షాక్ ఇచ్చాడు. శ్రీజ అనే అమ్మాయితో మానస్ సైలెంట్‌గా నిశ్చితార్థం జరుపుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పిక్స్ నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నాయి. మానస్ తన సోషల్ మీడియాలో నిశ్చితార్థం ఫోటోలని ఇన్‌స్టాలో పోస్ట్ చేయడంతో అవి క్షణాలలో వైరల్ అయ్యాయి.ఇక వీరి నిశ్చితార్థానికి పలువురు టీవీ ప్రముఖులు హాజరయ్యారు.
అయితే వీరిది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిందా అనే దానిపై క్లారిటీ లేదు. మానస్ చేసుకోబోయే ఎవరు అనే దాని గురించి నెటిజన్స్ మాత్రం తెగ ఆరాలు తీస్తున్నారు. త్వరలోనే మానస్, శ్రీజ పెళ్లి ముహూర్తం ఖరారు చేయనున్నారు.
బుల్లితెరపై, సోషల్ మీడియాలో క్రేజీ స్టార్‌గా మారిన మానస్ ఇప్పుడు టివి సీరియల్స్ లో నటిస్తూనే అప్పుడప్పుడూ మ్యూజిక్ వీడియోలలో కూడా సందడి చేస్తున్నాడు. ఈ మధ్య విష్ణుప్రియాతో కలసి జరీ జరీ పంచె కట్టి అనే సాంగ్ లో అద్భుతంగా డ్యాన్స్ చేసి అదరగొట్టాడు.పలు సినిమాలు కూడా చేస్తున్నాడు. సీరియల్స్‌తో మానస్‌కి మంచి గుర్తింపు రాగా, ఆయన ప్రస్తుతం తన కెరీర్ సజావుగా సాగేలా ప్లాన్ చేసుకుంటున్నాడు.