Madhya Pradesh | పిల్లలను కనాలని ఉంది.. నా భర్తను పెరోల్‌పై విడుదల చేయండి..
Madhya Pradesh | ఓ వ్యక్తికి ఏడేండ్ల క్రితం వివాహమైంది. కానీ పెళ్లైన కొద్ది రోజులకే ఓ హత్య కేసులో జైలు పాలయ్యాడు. ఆ కేసులో దోషిగా తేలడంతో జీవిత ఖైదు విధించారు. మొత్తంగా ఆ వ్యక్తి తన భార్యతో కలిసిన సందర్భమే లేదు. అయితే తనకు సంతానం కావాలని, తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని భార్య కోర్టును అభ్యర్థించింది. వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ గ్వాలియర్ శివ్‌పురి ప్రాంతానికి చెందిన దారా సింగ్ జాతవ్‌కు ఏడేండ్ల […]

Madhya Pradesh |
ఓ వ్యక్తికి ఏడేండ్ల క్రితం వివాహమైంది. కానీ పెళ్లైన కొద్ది రోజులకే ఓ హత్య కేసులో జైలు పాలయ్యాడు. ఆ కేసులో దోషిగా తేలడంతో జీవిత ఖైదు విధించారు. మొత్తంగా ఆ వ్యక్తి తన భార్యతో కలిసిన సందర్భమే లేదు. అయితే తనకు సంతానం కావాలని, తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని భార్య కోర్టును అభ్యర్థించింది.
వివరాల్లోకి వెళ్తే.. మధ్యప్రదేశ్ గ్వాలియర్ శివ్‌పురి ప్రాంతానికి చెందిన దారా సింగ్ జాతవ్‌కు ఏడేండ్ల క్రితం ఓ మహిళతో వివాహమైంది. వివాహమైన కొద్ది రోజులకే సింగ్ ఓ హత్య కేసులో అరెస్టు అయ్యాడు. ఈ కేసులో దోషిగా తేలడంతో కోర్టు అతనికి జీవిత ఖైదు విధించింది. దీంతో దారా సింగ్ గ్వాలియర్ సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నాడు.
అయితే దారా భార్య ఇటీవలే కోర్టుకు దరఖాస్తు చేసుకుంది. తనకు పిల్లల్ని కనాలని ఉందని తన భర్తను పెరోల్‌పై విడుదల చేయాలని కోర్టును అభ్యర్థించింది. ఆమె అభ్యర్థనపై సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ స్పందించారు.
జైలు నిబంధనల ప్రకారం.. జీవిత ఖైదు పడిన దోషి రెండేండ్ల శిక్షా కాలం పూర్తి చేసుకున్న తర్వాత అతడి సత్ప్రవర్తన ఆధారంగా పెరోల్ పొందే అవకాశం ఉందన్నారు. దీనిపై కలెక్టర్ తుది నిర్ణయం తీసుకుంటారని తెలిపారు.
అయితే గతంలో రాజస్థాన్‌కు చెందిన ఓ మహిళ కూడా ఈ విధంగానే కోర్టును అభ్యర్థించింది. సంతానం పొందేందుకు తనకున్న హక్కును వినియోగించుకునేందుకు జైల్లో ఉన్న తన భర్తను విడుదల చేయాలని ఆ మహిళ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై అప్పట్లో విచారణ జరిపిన జోధ్‌పూర్ ధర్మాసనం.. ఆ ఖైదీకి 15 రోజుల పెరోల్ మంజూరు చేసింది.