Maharashtra | మూడున్నరేండ్లలో మూడోసారి! డిప్యూటీ సీఎంగా అజిత్ ముచ్చ‌ట ఇది..

Maharashtra | ముంబై: ఈ మూడున్న‌రేండ్ల కాలంలో ముచ్చ‌ట‌గా మూడు సార్లు డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్ర‌మాణం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హారాష్ట్ర‌లో ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజార్టీ రాక‌పోవ‌డంతో.. ప్ర‌భుత్వ ఏర్పాటు కొంత ఆల‌స్య‌మైంది. ఈ క్ర‌మంలో అజిత్ ప‌వార్‌కు బీజేపీ గాలం వేసింది. అజిత్ వ‌ర్గం ఎమ్మెల్యేల మ‌ద్ద‌తుతో 2019 న‌వంబ‌ర్‌లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు సీఎంగా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ ప‌వార్ ప్ర‌మాణం […]

Maharashtra | మూడున్నరేండ్లలో మూడోసారి! డిప్యూటీ సీఎంగా అజిత్ ముచ్చ‌ట ఇది..

Maharashtra |

ముంబై: ఈ మూడున్న‌రేండ్ల కాలంలో ముచ్చ‌ట‌గా మూడు సార్లు డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్ర‌మాణం చేశారు. 2019 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మ‌హారాష్ట్ర‌లో ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజార్టీ రాక‌పోవ‌డంతో.. ప్ర‌భుత్వ ఏర్పాటు కొంత ఆల‌స్య‌మైంది. ఈ క్ర‌మంలో అజిత్ ప‌వార్‌కు బీజేపీ గాలం వేసింది.

అజిత్ వ‌ర్గం ఎమ్మెల్యేల మ‌ద్ద‌తుతో 2019 న‌వంబ‌ర్‌లో బీజేపీ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసింది. నాడు సీఎంగా దేవేంద్ర ఫ‌డ్న‌వీస్, డిప్యూటీ సీఎంగా అజిత్ ప‌వార్ ప్ర‌మాణం చేశారు. ఈ స‌మ‌యంలో శ‌ర‌ద్ ప‌వార్ చ‌క్రం తిప్పి.. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే అజిత్ ప‌వార్‌ను వెన‌క్కి ర‌ప్పించారు. దాంతో బీజేపీ ప్ర‌భుత్వం కూలిపోయింది.

ఇక శివ‌సేన‌, ఎన్సీపీ, కాంగ్రెస్ పార్టీలు క‌లిసి మ‌హావికాస్‌ అఘాడీ పేరుతో 2019 డిసెంబ‌ర్‌లో సంకీర్ణ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశాయి. నాడు శివ‌సేన చీఫ్ ఉద్ధ‌వ్ థాక్రే సీఎంగా, అజిత్ ప‌వార్ రెండోసారి డిప్యూటీ సీఎంగా ప్ర‌మాణం చేశారు. తాజాగా మ‌రోసారి అజిత్‌ను బీజేపీ త‌న బుట్ట‌లో వేసుకుంది.

దాంతో ఆయన రెండోసారి ఎన్సీపీ చీల్చి మహారాష్ట్రలోని ఎన్డీఏ సంకీర్ణ సర్కారుకు మద్దతు ప్రకటించాడు. దాంతో షిండే ప్రభుత్వం అతనికి ఉప ముఖ్యమంత్రి పదవిని ఆఫర్‌ చేసింది. ఇప్పుడు సీఎం ఏక్‌నాథ్‌ షిండే సమక్షంలో అజిత్‌పవార్‌ మూడోసారి ఉపముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.