Mahesh Kumar Goud | కేసీఆర్ కార‌ణంగా.. డ‌బ్బు చుట్టూ తెలంగాణ రాజ‌కీయాలు: మహేష్

పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ Mahesh Kumar Goud | విధాత‌: తెలంగాణ రాజకీయాలు డబ్బుచుట్టే తిరగడానికి కేసీఆర్ కారణమ‌ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రెండు టర్ములల్లో ఎమ్మెల్యేలుగా వున్న బిఆర్ఎస్ నేతలు అరాచకంగా సంపాదించి, వందల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నార‌ని, అందుకే తిరిగి వారికే టికెట్లు ఇచ్చారన్నారు. కాగా.. వారి భూమి వున్న చోటే కలెక్టరేట్ లు ఎస్‌పీ కార్యాలయాలు, స్టేడియంలు కట్టారని ఆరోపించారు. […]

  • Publish Date - August 22, 2023 / 12:40 PM IST
  • పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్

Mahesh Kumar Goud |

విధాత‌: తెలంగాణ రాజకీయాలు డబ్బుచుట్టే తిరగడానికి కేసీఆర్ కారణమ‌ని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. రెండు టర్ములల్లో ఎమ్మెల్యేలుగా వున్న బిఆర్ఎస్ నేతలు అరాచకంగా సంపాదించి, వందల కోట్లు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నార‌ని, అందుకే తిరిగి వారికే టికెట్లు ఇచ్చారన్నారు.

కాగా.. వారి భూమి వున్న చోటే కలెక్టరేట్ లు ఎస్‌పీ కార్యాలయాలు, స్టేడియంలు కట్టారని ఆరోపించారు. వేలాది ఎకరాల భూమిని కొల్లగొట్టారన్నారు. మళ్లీ కేసీఆర్ అధికారంలోకి వస్తే.. రాష్ట్రాన్ని కూడా అమ్మేస్తారన్నారు. కేసీఆర్ బీసీలకు అన్యాయం చేశాడ‌డ‌ని, 54,55 శాతం ఉన్న బిసిలకు కేవ‌లం 23 సీట్లే ఇచ్చార‌ని ఆరోపించారు. అన్ని వర్గాలను వంచించే విధంగా బిఆర్ఎస్ లిస్ట్ ఉంద‌న్నారు.