మెదక్ జిల్లాలో దారుణం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై గొడ్డలితో దాడి

Medak Dist | మద్యం మత్తులో ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడు దారుణానికి పాల్పడ్డాడు. తన బైక్ ను ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని తుప్రాన్ పట్టణంలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. జిల్లా పరిధిలోని నర్సాపూర్ రోడ్డులో హైవే వంతెన వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి పీకల దాకా మద్యం సేవించి.. బైక్ పై వెళ్తున్నాడు. […]

మెదక్ జిల్లాలో దారుణం.. ట్రాఫిక్ కానిస్టేబుల్ పై గొడ్డలితో దాడి

Medak Dist | మద్యం మత్తులో ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడు దారుణానికి పాల్పడ్డాడు. తన బైక్ ను ఆపిన ట్రాఫిక్ కానిస్టేబుల్ పై గొడ్డలితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని తుప్రాన్ పట్టణంలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళ్తే.. జిల్లా పరిధిలోని నర్సాపూర్ రోడ్డులో హైవే వంతెన వద్ద పోలీసులు వాహనాల తనిఖీలు నిర్వహించారు. మల్లేష్ యాదవ్ అనే వ్యక్తి పీకల దాకా మద్యం సేవించి.. బైక్ పై వెళ్తున్నాడు. పోలీసులు అతన్ని బైక్ ను ఆపారు. బైక్ కు సంబంధించిన పత్రాలు చూపించాలని ట్రాఫిక్ కానిస్టేబుల్ మహ్మద్ హఫీజ్ అడిగాడు. అందుకు అతను నిరాకరించాడు. పోలీసులు బైక్ ను సీజ్ చేశారు.

దీంతో మల్లేష్ అక్కడ్నుంచి వెళ్లిపోయాడు. అరగంట తర్వాత తిరిగొచ్చిన మల్లేష్.. గొడ్డలితో హఫీజ్ పై దాడి చేశాడు. అప్రమత్తమైన పోలీసులు, స్థానికులు మల్లేష్ ను అదుపులోకి తీసుకున్నారు. గాయాలపాలైన కానిస్టేబుల్ ను చికిత్స నిమిత్తం తుప్రాన్ లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ కు తరలించారు. ప్రస్తుతం హఫీజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు.