చికెన్ బిర్యానీ ఇవ్వలేదని రెస్టారెంట్‌కు నిప్పంటించాడు.. వీడియో
Chicken Biryani | చికెన్ బిర్యానీ.. ఈ పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరుతోంది. ఆ వాసన చూడగానే సగం కడుపు నిండిపోతోంది. ఇక తిన్నామంటే.. ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అలాంటి చికెన్ బిర్యానీని ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. ఓ తాగుబోతు కూడా చికెన్ బిర్యానీ కోసం రెస్టారెంట్ కు వెళ్లాడు. కానీ చికెన్ బిర్యానీ ఇవ్వకపోవడంతో ఆ రెస్టారెంట్ కే నిప్పంటించాడు. ఈ ఘటన న్యూయార్క్ సిటీలోని క్వీన్స్ ఏరియాలో కొద్ది రోజుల క్రితం […]

Chicken Biryani | చికెన్ బిర్యానీ.. ఈ పేరు వింటేనే నోట్లో లాలాజలం ఊరుతోంది. ఆ వాసన చూడగానే సగం కడుపు నిండిపోతోంది. ఇక తిన్నామంటే.. ఆ ఫీలింగ్ వేరే ఉంటుంది. అలాంటి చికెన్ బిర్యానీని ప్రతి ఒక్కరూ ఇష్టపడుతారు. ఓ తాగుబోతు కూడా చికెన్ బిర్యానీ కోసం రెస్టారెంట్ కు వెళ్లాడు. కానీ చికెన్ బిర్యానీ ఇవ్వకపోవడంతో ఆ రెస్టారెంట్ కే నిప్పంటించాడు. ఈ ఘటన న్యూయార్క్ సిటీలోని క్వీన్స్ ఏరియాలో కొద్ది రోజుల క్రితం చోటు చేసుకోగా, ఆలస్యంగా వెలుగు చూసింది.
క్వీన్స్ ఏరియాలో బంగ్లాదేశీ రెస్టారెంట్ ఉంది. చికెన్ బిర్యానీ కోసం ఓ తాగుబోతు అక్కడికి వెళ్లి ఆర్డర్ చేశాడు. కౌంటర్ లో ఉన్నవారు కాసేపటికే చికెన్ బిర్యానీ ఇచ్చారు. కానీ అతను మాత్రం కోపంతో ఊగిపోయాడు. ఇది చికెన్ బిర్యానా? అంటూ సిబ్బంది ముఖంపై విసిరి కొట్టాడు. ఇక ఆ మరుసటి రోజు పొద్దున్నే రెస్టారెంట్ వద్దకు పెట్రోల్ తీసుకొచ్చి చల్లాడు. ఆ తర్వాత నిప్పంటించాడు. దీంతో రెస్టారెంట్ దగ్ధమైంది. ఈ కేసులో నిందితుడు చోఫెల్ నోర్బు(49)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెస్టారెంట్ కు నిప్పంటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.