Manchiryala | త్వరలో సీఎంచే మంచిర్యాల కలెక్టర్ కార్యాలయ నూతన భవన ప్రారంభోత్సవం

Manchiryala లక్ష మందితో బహిరంగ సభ ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ విధాత‌: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నూతన భవన ప్రారంభోత్సవాన్ని ఈనెల చివరలో గాని జూన్ మొదటి వారంలో గాని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు. మంచిర్యాల జిల్లా నస్పూర్ లో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాన్ని బాల్క […]

  • Publish Date - May 22, 2023 / 10:37 AM IST

Manchiryala

  • లక్ష మందితో బహిరంగ సభ
  • ప్రగతి పథంలో దూసుకుపోతున్న తెలంగాణ
  • ప్రభుత్వ విప్, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్

విధాత‌: మంచిర్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం నూతన భవన ప్రారంభోత్సవాన్ని ఈనెల చివరలో గాని జూన్ మొదటి వారంలో గాని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరుగుతుందని ప్రభుత్వ విప్ చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పేర్కొన్నారు.

మంచిర్యాల జిల్లా నస్పూర్ లో నూతనంగా నిర్మించిన జిల్లా కలెక్టర్ కార్యాలయ భవనాన్ని బాల్క సుమన్, జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్, అధికారుల బృందం బుధ‌వారం సందర్శించారు.

ఈ సందర్భంగా బాల్క మాట్లాడుతూ కలెక్టర్ నూతన కార్యాలయ భవనం దాదాపుగా పూర్తయిందని చిన్న చిన్న పనులు మిగిలి ఉన్నాయని వాటిని రెండు మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు .

తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావంతో కేసీఆర్ నేతృత్వంలో మంచిర్యాల జిల్లా ఎంతో అభివృద్ధి చెందిందని, తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో దూసుకుపోతుందని ఆయన పేర్కొన్నారు. గతంలో కాంగ్రెస్, టిడిపి, బిజెపి తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, అవసరాలను నెరవేర్చలేకపోయారని విమ‌ర్శించారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన‌ తొమ్మిది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందిందని అన్నారు. ఈనెల చివరలో గాని జూన్ మాసం మొదటి వారంలో మంచిర్యాల జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటించనున్నారని అందులో భాగంగానే జిల్లా కలెక్టర్ నూతన భవన ప్రారంభోత్సవం చేస్తారని, అలాగే బిఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తారని తెలిపారు .

మంచిర్యాల, గోలివాడ మధ్యలో ఉన్న గోదావరి నదిపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారని తెలిపారు. మంచిర్యాల లో ఏర్పాటు చేస్తున్న మెడికల్ కాలేజీ నూతన భవనానికి భూమి పూజ చేస్తారని తెలిపారు.

1658 కోట్లతో లక్ష ఎకరాలకు సాగునీరు అందించడానికి నిర్మితమయ్యే చెన్నూరు ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ భూమి పూజ చేస్తారని పేర్కొన్నారు . సీఎం పర్యటనకు సంబంధించిన షెడ్యూలును త్వరలో తెలియజేస్తానని తెలిపారు.

Latest News