IPL 2024 RR vs KKR రాజస్థాన్ బ్యాడ్‌లక్ – వర్షం కారణంగా రెండో స్థానానికి సన్‌రైజర్స్
రాజస్థాన్ ప్లేఆఫ్స్‌లో రెండోస్థానానికి చేరుకోవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. కోల్‌కతా–రాజస్థాన్ (KKR vs RR) మధ్య జరగాల్సిన పోరును వరుణుడు తుడిచిపెట్టడం(Rain washed out)తో రాజస్థాన్‌కు షాక్ తగిలింది.
ఐపిఎల్ 2024(IPL 2024)లో భాగంగా గువాహటీ(Guwahati) లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్ జట్ల మధ్య జరగాల్సిన ఆఖరి లీగ్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. దీంతో రెండు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. ఇది కోల్కతాకేం నష్టం కలిగించకపోగా, రాజస్థాన్‌కు మాత్రం పెద్ద దెబ్బ తగిలింది. ఈ మ్యాచ్‌లో గెలిచి రెండో స్థానంలో సెటిల్ అవుదామనుకున్న ఆరార్(Rajasthan Royals) మూడో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సివచ్చింది. ఒకసారి వర్షం ఆగిపోయి, మ్యాచ్‌ను 7 ఓవర్లకు కుదించారు. టాస్ గెలిచిన కోల్‌కతా ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ దశలో మళ్లీ కురిసిన వర్షం పూర్తిగా మ్యాచ్‌ను తుడిచిపెట్టింది. అదనంగా వచ్చిన ఒక్క పాయింట్‌తో రాజస్థాన్ కూడా, ఇంతకుముందే పంజాబ్‌తో మ్యాచ్ గెలిచి 17 పాయింట్లు సాధించిన సన్‌రైజర్స్‌తో సమానంగా 17 పాయింట్లు గెల్చుకుంది. రెండు జట్లు సమాన పాయింట్లతో ఉన్నప్పుడు నెట్ రన్‌రేట్ ఆధారంగా ముందడుగు పడుతుంది. ఆవిధంగా రాజస్థాన్(+0.273) కంటే మెరుగైన రన్‌రేట్ ఉన్న హైదరాబాద్ (+0.414))రెండో స్థానంలోకి అడుగుపెట్టింది.
మొత్తానికి ప్లేఆఫ్స్ స్థానాలు( Play 0ffs positions confirmed) ఖరారయ్యాయి. మొదటి స్థానంలో కోల్‌కతా, రెండో స్థానంలో హైదరాబాద్, మూడో స్థానంలో రాజస్థాన్, ఆఖరి స్థానంలో సంచలన రీతిలో ప్లేఆఫ్స్‌లో అడుగుపెట్టిన బెంగళూరు ఉన్నాయి.

కాగా, ప్లేఆఫ్స్ మ్యాచ్ షెడ్యూలు ఈ విధంగా ఉంది.
క్వాలిఫయర్ –1 (నరేంద్రమోదీ స్టేడియం, అహ్మదాబాద్): మే 21, 2024
మే 21న అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో క్వాలిఫయర్ 1 మ్యాచ్ నిర్వహిస్తారు. ఇందులో 1వ, 2వ స్థానాల్లో ఉన్న కోల్‌కతా, హైదరాబాద్ తలపడతాయి. ఇందులో విజేత నేరుగా ఫైనల్లోకి ప్రవేశిస్తుంది. ఓడిపోయినవారు, ఎలినేటర్ మ్యాచ్‌లో గెలిచినవారితో క్వాలిఫయర్2లో ఆడతారు.
ఎలిమినేటర్ (నరేంద్రమోదీ స్టేడియం, అహ్మదాబాద్): మే 22, 2024
మే 22న అహ్మదాబాద్ నరేంద్రమోదీ స్టేడియంలో ఎలిమినేటర్ మ్యాచ్ జరుగనుంది. ఇందులో 3వ, 4వ స్థానాల్లో ఉన్న రాజస్థాన్, బెంగళూరు జట్లు పోరాడతాయి. గెలిచినవారు క్వాలిఫయర్1లో ఓడిపోయినవారితో క్వాలిఫయర్2లో తలపడతారు. ఓడినవారు ఇంటిముఖం పడతారు.
క్వాలిఫయర్ –2 (ఎంఎ చిదంబరం స్టేడియం, చెన్నై): మే 24, 2024
మే 24న శుక్రవారం రోజున చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో క్వాలిఫయర్2 మ్యాచ్ జరుగుతుంది. ఇందులో క్వాలిఫయర్ 1లో ఓడినవారు, ఎలిమినేటర్‌లో గెలిచినవారు ఆడతారు. గెలిచినవారు ఫైనల్లో క్వాలిఫయర్1 విజేతతో ఢీ కొడతారు.
ఫైనల్ మ్యాచ్ (ఎంఎ చిదంబరం స్టేడియం, చెన్నై): మే 26, 2024
మే 26, ఆదివారం నాడు చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్ ఐపిఎల్ 2024 విజేతను నిర్ణయించనుంది. దీంతో ఈ సీజన్ (2024) ఘనంగా ముగుస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram