Manchiryala | మానవాళి మనుగడకు మొక్కలు ఎంతో అవసరం: వెంకటేశ్వర్ రెడ్డి
Manchiryala ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలి . సింగరేణి ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ జి వెంకటేశ్వర్ రెడ్డి విధాత, ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గని పని ప్రదేశాలను సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ జి వెంకటేశ్వర్ రెడ్డి , శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి సంజీవరెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం ముందున్న సెంట్రల్ నర్సరీకి రోడ్డుకిరువైపులా మొక్కలు […]

Manchiryala
- ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటాలి .
- సింగరేణి ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ డైరెక్టర్ జి వెంకటేశ్వర్ రెడ్డి
విధాత, ప్రతినిధి ఉమ్మడి అదిలాబాద్: మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని సింగరేణి ఓపెన్ కాస్ట్ గని పని ప్రదేశాలను సింగరేణి డైరెక్టర్ ప్రాజెక్ట్ అండ్ ప్లానింగ్ జి వెంకటేశ్వర్ రెడ్డి , శ్రీరాంపూర్ ఏరియా జనరల్ మేనేజర్ బి సంజీవరెడ్డితో కలిసి పరిశీలించారు. అనంతరం శ్రీరాంపూర్ జిఎం కార్యాలయం ముందున్న సెంట్రల్ నర్సరీకి రోడ్డుకిరువైపులా మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ.. వర్షాకాలంలో తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని వర్షపు నీరు క్వారీలో నిల్వ ఉండకుండా తగు చర్యలు తీసుకోవాలని పంపుల ద్వారా ఎప్పటికప్పుడు నీటిని బయటికి పంపిస్తూ ఉండాలని రక్షణతో కూడిన ఉత్పత్తి ఉత్పాదకతను సాధించాలని అన్నారు.
ఓవర్ బర్డెన్ ( ఓబి ) తొలగింపు , బొగ్గు ఉత్పత్తి లక్ష్యాన్ని చేరుకోవడానికి తగిన ప్రణాళికలు వేసుకొని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ సందర్భంగా నూతన ఓబి కాంట్రాక్టు GVR ప్రతినిధులకు త్వరగా ఓబి వెలికితీత పనులు ప్రారంభించాలని సూచించారు.
మొక్కలు నాటిన అనంతరం మాట్లాడుతూ… సింగరేణి యాజమాన్యం సింగరేణి ఉన్న అన్ని ప్రాంతాలలో మొక్కలు నాటడం జరుగుతుందని అన్నారు. వాటిని పరిరక్షించడానికి ప్రత్యేక రక్షణ చర్యలు తీసుకుంటుందన్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా తమ వంతు బాధ్యతను సింగరేణి నిర్వహిస్తుందని తెలిపారు. మానవాళి మనుగడకు మొక్కలు చాలా అవసరమని దీన్ని ప్రతి ఒక్కరూ దృష్టిలో పెట్టుకొని తమవంతుగా మొక్కలు నాటాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రాజెక్ట్ ఆఫీసర్ శ్రీ పురుషోత్తమ రెడ్డి ఇంచార్జ్ గని మేనేజర్ శ్రీ శ్రీనివాస్ ప్రాజెక్టు ఇంజనీర్ శ్రీ చంద్రశేఖర్ సర్వే అధికారి సంపత్ తదితరులు పాల్గొన్నారు.