Manipur Violence | మణిపూర్‌లో మళ్లీ హింస.. తండ్రి,కొడుకుతో సహ ముగ్గురి హత్య
Manipur Violence పదునైన ఆయుధాలతో పొడిచి హత్య బాధిత కుటుంబాల ఆందోళన ఘర్షణలో మరో ముగ్గురికి గాయాలు విధాత: మణిపూర్ రావణకాష్టంలా మండుతూనే ఉన్నది. తాజాగా చెలరేగిన హింసలో తండ్రి, కొడుకుతో పాటు ముగ్గురు మరణించారు. బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి రెండు గంటలకు ఉఖా తంపక్ ప్రాంతంలో తమ ఇండ్లకు కాపాలా కాస్తున్న సమయంలో ఈ ముగ్గురిని గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో పొడిచి చంపేశారు. మృతుల్లో తండ్రి, కొడుకుతో పాటు మరొకరు ఉన్నారు. […]

Manipur Violence
- పదునైన ఆయుధాలతో పొడిచి హత్య
- బాధిత కుటుంబాల ఆందోళన
- ఘర్షణలో మరో ముగ్గురికి గాయాలు
విధాత: మణిపూర్ రావణకాష్టంలా మండుతూనే ఉన్నది. తాజాగా చెలరేగిన హింసలో తండ్రి, కొడుకుతో పాటు ముగ్గురు మరణించారు. బిష్ణుపూర్ జిల్లాలో శుక్రవారం రాత్రి రెండు గంటలకు ఉఖా తంపక్ ప్రాంతంలో తమ ఇండ్లకు కాపాలా కాస్తున్న సమయంలో ఈ ముగ్గురిని గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో పొడిచి చంపేశారు. మృతుల్లో తండ్రి, కొడుకుతో పాటు మరొకరు ఉన్నారు.
పోలీస్ ముఖానికి బుల్లెట్ గాయం
ముగ్గురిని చంపడంతో ఆగ్రహానికి గురైన స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. చురచంద్‌పూర్ వైపు వెళ్లేందుకు ఆందోళనకారులు ప్రయత్నించగా భద్రతా సిబ్బంది వారిని అడ్డుకున్నారు. క్వాక్త సమీపంలో శనివారం ఉదయం మిలిటెంట్లకు, రాష్ట్ర భద్రతా సిబ్బంది మధ్య జరిగిన కాల్పుల్లో ఒక పోలీస్ సహా ముగ్గురు గాయపడ్డారు. పోలీస్ ముఖానికి బుల్లెట్ గాయమైంది.
క్షతగాత్రులు ముగ్గురిని చికిత్స నిమిత్తం ఇంఫాల్‌లోని రాజ్ మెడిసిటీ దవాఖానకు తరలించారు. ముగ్గురికి ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు. తాజా ఉద్రిక్తతల నేపథ్యంలో ఇంఫార్ రెండు జిల్లాల్లో యంత్రాంగం కర్ఫ్యూ సడలింపులను కుదించింది. గతంలో ఉదయ ఆరు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కర్ఫ్యూ సడలింపు ఉండగా, దానిని ఉదయం ఆరింటి నుంచి 10.30 గంటలకు వరకు కుదించారు.