Medak | BRS నేత తౌరియా నాయక్‌కు కన్నీటి వీడ్కోలు
Medak అంత్యక్రియలకు హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే, యువనేత సోలిపేట సతీష్.. కన్నీరు.. మున్నీరైన నర్సంపల్లే మృతుల భౌతిక దేహాలకు గులాబీ జెండా కప్పి నివాళులు అర్పించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి.. విధాత, మెదక్ బ్యూరో: రోడ్డు ప్రమాదంలో మరణించిన బిఆర్ ఎస్ నేత తౌరియా నాయక్, ఆయన కుమారుడు అంకిత్ నాయక్ లకు అంత్యక్రియలు స్వగ్రామం నర్సంపల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలో ఆప్తులు, బంధువులు, పార్టీ నేతలు, కార్యకర్తల అశ్రునయనాల […]

Medak
- అంత్యక్రియలకు హాజరైన ఎంపీ, ఎమ్మెల్యే, యువనేత సోలిపేట సతీష్..
- కన్నీరు.. మున్నీరైన నర్సంపల్లే
- మృతుల భౌతిక దేహాలకు గులాబీ జెండా కప్పి నివాళులు అర్పించిన ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి..
విధాత, మెదక్ బ్యూరో: రోడ్డు ప్రమాదంలో మరణించిన బిఆర్ ఎస్ నేత తౌరియా నాయక్, ఆయన కుమారుడు అంకిత్ నాయక్ లకు అంత్యక్రియలు స్వగ్రామం నర్సంపల్లిలో తన వ్యవసాయ క్షేత్రంలో ఆప్తులు, బంధువులు, పార్టీ నేతలు, కార్యకర్తల అశ్రునయనాల మధ్య జరిగాయి.
మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, దుబ్బాక మాజీ ఎమ్మెల్యే, దివంగత సోలిపేట రామలింగారెడ్డి తనయుడు సోలిపేట సతీష్ రెడ్డిలుహాజరయ్యారు. ఈ సందర్భంగా గులాబీ జెండా ను మృతుల భౌతిక దేహాలకు కప్పి నివాళులు అర్పించి కన్నీటి వీడ్కోలు పలికారు.
పార్టీ మంచి భవిష్యత్తు ఉన్న నాయకుణ్ణి కోల్పోయిందని ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి కన్నిటీ పర్యంతం అయ్యారు. మండల పార్టీ అధ్యక్షునిగా,ఎంపీటీసీ గా సింగిల్ విండో ప్రెసిడెంట్ గా నాయక్ చేసిన సేవలను కొనియాడారు.
మృతుని కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని వారు పేర్కొన్నారు. మృతుని కుటుంబ సభ్యులను ఎంపీ, ఎమ్మెల్యే, సోలిపేట సతీష్ లు ఓదార్చారు. ఎంపీపీ చిందం సబితా, జడ్పిటీసీ కృష్ణారెడ్డితో పాటు వందలాది మంది పాల్గొన్నారు.