Medak | ప్ర‌శాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమిన‌రీ పరీక్ష

Medak 65:56 శాతం అభ్యర్థుల హాజరు విధాత, మెదక్ బ్యూరో: జిల్లాలోని 7 కేంద్రాలలో ఆదివారం నిర్వహించిన టీఎస్‌పీఎస్‌సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లాకు 3,293 అభ్యర్థులను కేటాయించగా 2,159 మంది అనగా 65:56 శాతం అభ్యర్థులు హాజరయ్యారని, 1,134 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరు కాలేదని అన్నారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి ఆదివారం నర్సాపూర్ లోని బి.వి.ఆర్.ఐ.టి. ఇంజనీరింగ్ కళాశాల, మెదక్ లోని గీతా […]

Medak | ప్ర‌శాంతంగా ముగిసిన గ్రూప్ 1 ప్రిలిమిన‌రీ పరీక్ష

Medak

  • 65:56 శాతం అభ్యర్థుల హాజరు

విధాత, మెదక్ బ్యూరో: జిల్లాలోని 7 కేంద్రాలలో ఆదివారం నిర్వహించిన టీఎస్‌పీఎస్‌సి గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. జిల్లాకు 3,293 అభ్యర్థులను కేటాయించగా 2,159 మంది అనగా 65:56 శాతం అభ్యర్థులు హాజరయ్యారని, 1,134 మంది ప్రిలిమినరీ పరీక్షకు హాజరు కాలేదని అన్నారు.

ఎస్పీ రోహిణి ప్రియదర్శినితో కలిసి ఆదివారం నర్సాపూర్ లోని బి.వి.ఆర్.ఐ.టి. ఇంజనీరింగ్ కళాశాల, మెదక్ లోని గీతా జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష సజావుగా జరిగింద‌ని ఎటువంటి సంఘటనలు జరగలేదని స్పష్టం చేశారు.