Medak | ఘ‌నంగా జిల్లాలో హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు.. కిక్కిరిసిన ఆల‌యాలు

Medak భ‌క్తి పార‌వ‌శ్యంలో తేలియాడిన హ‌నుమాన్ మాల‌ధారులు పంచముఖి ఆలయంలో గణపతి హోమం… భారీగా తరలివచ్చిన భక్తులు…. ఆలయంలో అన్నదానం.. విధాత‌, మెద‌క్ బ్యూరో: హనుమాన్ జయంతి వేడుకలు మెదక్ పట్టణం పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో వైభవంగా జరిగాయి. వంశానుగత ధర్మకర్త కాకులవారం మధుసూదనాచారి ఆధ్వర్యంలో ఉదయం నుండి స్వామి వారికి ఆవుపాలతో అభిషేకం, మహాలంకరణ, మహా మంగళహారతి, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, హోమం అనంతరం తీర్థ ప్రసాద వితరణ, అన్నదానం చేశారు. బిజెపి జిల్లా […]

Medak | ఘ‌నంగా జిల్లాలో హ‌నుమాన్ జ‌యంతి వేడుక‌లు.. కిక్కిరిసిన ఆల‌యాలు

Medak

  • భ‌క్తి పార‌వ‌శ్యంలో తేలియాడిన హ‌నుమాన్ మాల‌ధారులు
  • పంచముఖి ఆలయంలో గణపతి హోమం…
  • భారీగా తరలివచ్చిన భక్తులు….
  • ఆలయంలో అన్నదానం..

విధాత‌, మెద‌క్ బ్యూరో: హనుమాన్ జయంతి వేడుకలు మెదక్ పట్టణం పంచముఖ ఆంజనేయస్వామి ఆలయంలో వైభవంగా జరిగాయి. వంశానుగత ధర్మకర్త కాకులవారం మధుసూదనాచారి ఆధ్వర్యంలో ఉదయం నుండి స్వామి వారికి ఆవుపాలతో అభిషేకం, మహాలంకరణ, మహా మంగళహారతి, సామూహిక హనుమాన్ చాలీసా పారాయణం, హోమం అనంతరం తీర్థ ప్రసాద వితరణ, అన్నదానం చేశారు.

బిజెపి జిల్లా అధ్యక్షులు గడ్డం శ్రీనివాస్, ఏడుపాయల డైరెక్టర్ రాగి చక్రపాణి భాగ్యలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాగి అశోక్, ఎఎంసి మాజీ డైరెక్టర్ కొండ శ్రీనివాస్, మెదక్ తదితర ప్రాంతాల నుండి భక్తులు పెద్ద ఎత్తున దర్శించుకున్నారు.

భక్తిశ్రద్ధలతో హనుమాన్ జయంతి వేడుకలు

జిల్లాలోని అన్ని గ్రామాలలో హనుమాన్‌ జయంతి వేడుకలను ఆదివారం అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉత్సవాల నేపథ్యంలో ఆంజనేయ స్వామి దేవాలయాలను పచ్చటి తోరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించి అభిషేకాలు, హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్‌ విగ్రహాలు, చిత్రపటాలతో భక్తులు శోభాయాత్రలు చేపట్టారు. కాషాయం జెండాలతో బైక్‌ ర్యాలీలు తీశారు. జైశ్రీరాం.. జై హనుమాన్‌ అంటూ భక్తులు నినాదాలు చేశారు.

గ్రామాల్లో అంజ‌న్నకు విశేష పూజ‌లు

ఆదివారం రామ భక్త హనుమాన్ జయంతిని పురస్కరించుకుని జిల్లాలోని పలు గ్రామాల్లో ఆంజనేయ స్వామి దేవాలయాల‌లో హనుమాన్ జయంతి వేడుకలను జరుపుకున్నారు. అన్ని గ్రామాల్లోని ఆంజ‌నేయ‌, అభయాంజనేయ దేవాలయంలో అర్చకులు నిర్మాల్యము పంచామృతాభిషేకం ఆకు పూజ గావించి విశేష పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో ఉత్సవమూర్తిని ఆశీనులుగావించి మేళ తాళాలతో మంగళవాయిద్యాలతో పల్లకి సేవ చేశారు.

జిల్లా కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలోని ఆంజనేయస్వామి ఆలయంలో హనుమాన్‌ జయంతిని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు భాష్యం మధుసూదనచార్యుల, కృష్ణారావు శర్మ, శుక్లా ఆధ్వర్యంలో ఉదయం హనుమంతుడికి చందనపు పూజా పాదుపుజా, అష్టోత్తర శతనామావళి, అభిషేకాలు, ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం చాలీసా పారాయణము, భజన కీర్తనలు ఆలపించారు. దాంతో ఆలయ ప్రాంగణం అంజన్న నామస్మరణతో మార్మోగింది.

ఉదయం నుంచే ఆలయాలకు భక్తులు పోటెత్తారు. ఈ వేడుకల్లో వేద పండితులు కృష్ణ మూర్తి శర్మ, ప్రభాకర్ శర్మ, ఆలయ కమిటీ చైర్మన్ బండ నరేందర్ సభ్యులు పురుషోత్తం, నందిని శ్రీను, బద్రినాథ్, భక్తులు తదితరులు పాల్గొన్నారు.

హనుమాన్ భజనలతో మార్మోగిన ప్రాంతాలు

హనుమాన్ జయంతి వేడుకలు హ‌నుమాన్ మాలాధారులు అత్యంత వైభ‌వోపేతంగా నిర్వ‌హించుకున్నారు. భక్తులు వేలాదిగా హ‌నుమాన్ దేవాల‌య‌కు తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. హనుమాన్ భజనలతో ఆలయ ప‌రిస‌రాలు మార్మోగాయి. రెండేళ్ల నుంచి కరోనా వల్ల జయంతి ఉత్సవాలకు అనుమతి ఇవ్వలేదు. ఈసారి ఆల‌యాల్లో భక్తులు భారీగా తరలి వచ్చారు. అలాగే ప‌లు ఆల‌యాల వ‌ద్ద అన్న‌దాన‌లు నిర్వ‌హించారు. హ‌నుమాన్ మాలాధార స్వాములు భ‌జ‌న‌లు, హ‌నుమాన్ చాలీసా పారాయ‌ణం చేస్తూ భ‌క్తి పార‌వ‌శ్యంలో తేలియాడారు.