Medak | ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధిలో పల్లకి సేవ

Medak విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధిలో శనివారం రాత్రి పౌర్ణమిని పురస్కరించుకొని పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పల్లకిలో అమ్మవారిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా పల్లకిని రాజగోపురం నుండి పలు వీధుల గుండా ఊరేగించి ఆలయానికి చేర్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సాతెల్లి […]

Medak | ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధిలో పల్లకి సేవ

Medak

విధాత, మెదక్ బ్యూరో: మెదక్ జిల్లాలో పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గ భవాని మాత సన్నిధిలో శనివారం రాత్రి పౌర్ణమిని పురస్కరించుకొని పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం పల్లకిలో అమ్మవారిని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించి ఊరేగింపు చేపట్టారు. ఈ సందర్భంగా పల్లకిని రాజగోపురం నుండి పలు వీధుల గుండా ఊరేగించి ఆలయానికి చేర్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ సాతెల్లి బాలా గౌడ్, ఆలయ ఈవో సారా శ్రీనివాస్, వేద పండితులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.