విధాత: రాజధాని నగరం నడిబొడు్డన ఉన్న బన్సీలాల్ పేట మెట్ల భావి ప్రారంభానికి సిద్దమైంది. పునరుద్దరణ పనులు పూర్తి కావచ్చాయి. శుక్రవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్‌లు బన్సీలాల్ పేటలోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ చరిత్రకు సాక్యాక లుగా నిలిచే పురాతన కట్టడాల పరిరక్షణ కోసం ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో మెట్లబావి పునరుద్దరణ జరుగుతుందన్నారు. గొప్ప పర్యాటక ప్రాంతంగా మెట్లబావి పరిసరాలను తీర్చిదిద్దుతామని మంత్రి తలసాని చెప్పారు.
బన్సీలాల్ పేట లోని పురాతన మెట్లబావి వద్ద జరుగుతున్న అభివృద్ధి పనులను మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రెటరీ అరవింద్ కుమార్ గారితో కలిసి సందర్శించడం జరిగింది. @arvindkumar_ias pic.twitter.com/kdNWHbhxiY
— Talasani Srinivas Yadav (@YadavTalasani) November 11, 2022